Wednesday, January 22, 2025

రాజ్యసభ ఓటుకు రూ.25 కోట్లు ఆఫర్ చేశారు…

- Advertisement -
- Advertisement -

Rs 25 crore offered for Rajya Sabha vote

రాజస్థాన్ మంత్రి రాజేంద్ర గుడా సంచలన వాఖ్యలు

జైపూర్ : కాంగ్రెస్ నేత, రాజస్థాన్ మంత్రి రాజేంద్ర గుడా సంచలన వ్యాఖ్యలు చేశారు. జూన్ నెలలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఫలానా వ్యక్తికి ఓటేస్తే తనకు రూ 25 కోట్లు ఇస్తామంటూ ఆఫర్ వచ్చిందన్నారు. 2020లో సీఎం అశోక్ గెహ్లాట్ సర్కారుపై తిరుగుబాటు జరిగిన సందర్భాల్లో కూడా తనకు రూ. 60 కోట్లు ఆఫర్ వచ్చిందని చెప్పారు. అయితే ఆ రెండు ఆఫర్లనూ తిరస్కరించానన్నారు. ఈ ఆరోపణలు చేసినప్పుడు ఫలానా వ్యక్తిని గానీ, పార్టీ పేరును గానీ ఆయన ఎక్కడా ప్రస్తావించలేదు. రాజస్థాన్ లోని ఝంఝను లో సోమవారం ఓ ప్రయివేట్ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు అక్కడి విద్యార్థులతో మాట్లాడిన వీడియో మంగళవారం బయటకు వచ్చింది.. ఈ సందర్భంగా ఓ విద్యార్థిని అడిగిన ప్రశ్నకు మంత్రి రాజేంద్ర గుడా స్పందిస్తూ తనకు వచ్చిన ఆఫర్ల గురించి వివరించారు. దీనిపై తాను భార్య, కుమారుడు, కుమార్తెలతో మాట్లాడగా, మంచి ప్రవర్తన కన్నా డబ్బేం ముఖ్యం కాదని వారు చెప్పారని మంత్రి వివరించారు. మీతో ఉన్నవారు అలా ఆలోచిస్తే అంతా మంచే జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News