Monday, January 20, 2025

తొర్రూరు మున్సిపాలిటీకి రూ.25 కోట్లు మంజూరు

- Advertisement -
- Advertisement -
కెటిఆర్‌కు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి దయాకర్ రావు

హైదరాబాద్ : మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మున్సిపాలిటీకి రూ. 25 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. సోమవారం సంబంధిత ఉత్తర్వులను ఐటీ, పరిశ్రమలు, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కెటి రామారావు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు అందచేశారు. గతంలో తొర్రూరులో జరిగిన బహిరంగ సభలో మంత్రి కెటిఆర్ ఇచ్చిన హామీ మేరకు ఈ నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులను తొర్రూరులోని పలు అభివృద్ధి పనులకు ఉపయోగించుకోవాలని కెటిఆర్ ఎర్రబెల్లికి తెలిపారు. ఈ సందర్భంగా ఇచ్చిన మాటను నిలుపుకున్న ఆ మంత్రికి ఎర్రబెల్లి ధన్యవాదాలు తెలిపారు. కాగా, తొర్రూరు అభివృద్ధికి ఈ నిధులు మరింతగా తోడ్పడతాయని మంత్రి అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News