Sunday, January 19, 2025

హైదరాబాద్‌లో రూ.25లక్షల నగదు సీజ్

- Advertisement -
- Advertisement -

పార్లమెంట్ ఎన్నికల తనిఖీల్లో భాగంగా హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా చేపట్టిన తనిఖీల్లో భారీగా నగదు పట్టుకున్నారు. వివిధ ప్రాంతాల్లో చేపట్టిన తనిఖీల్లో వాహనాల్లో తరలిస్తున్న రూ.25,66,380 రూపాయల నగదు, 56, 39,223 రూపాయల విలువ గల ఇతర వస్తువులను వివిధ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాలు పట్టుకుని సీజ్ చేశారని జిల్లా ఎన్నికల అధికారి, జిహెచ్‌ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. శనివారం ఉదయం 6 గంటల నుండి ఆదివారం ఉదయం 6 వరకు ఫ్లయింగ్, ఎస్.ఎస్.టి బృందాలతో పాటు పోలీస్, శాఖ తనిఖీలు చేయడం వల్ల పెద్ద మొత్తంలో నగదు, ఇతర వస్తువులు పట్టుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో గడిచిన గత 24 గంటల వ్యవధిలో ఫ్లయింగ్ స్క్వాడ్ ద్వారా రూ.2,46,500 నగదు, ఎస్.ఎస్.టి ద్వారా 7,20,000 రూపాయల నగదు, పోలీస్ శాఖ ద్వారా 15,99,880 రూపాయల నగదు పట్టుకున్నారు. అంతే కాకుండా 56,39, 223 రూపాయల విలువ గల ఇతర వస్తువులను పట్టుకొని సీజ్ చేశారని జిల్లా ఎన్నికల అధికారి పేర్కొన్నారు.

ఎన్నికలపై 18 ఫిర్యాదులు వచ్చాయని, వాటిని పరిశీలించి పరిష్కరించామని తెలిపారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 24గంటల వ్యవధిలో 7 ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు. శాంతి భద్రతల అమలులో భాగంగా ఆయుధాల లైసెన్సులు ఉన్నవారు వారి వద్ద ఉన్న వెపన్స్‌ను 74 మంది డిపాజిట్ చేశారు. దీంతో ఇప్పటి వరకు మొత్తం 2,138 మంది వద్ద నుండి లైసెన్స్ ఉన్న ఆయుధాలను డిపాజిట్ చేసినట్లు తెలిపారు. ఎక్సైజ్ శాఖ ద్వారా వివిధ ప్రాంతంలో తనిఖీలు చేయగా 17,112లీటర్ల అక్రమ మద్యాన్ని పట్టుకొని సీజ్ చేయగా నలుగురిపై కేస్ నమోదు చేసి, ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి జిహెచ్‌ఎంసి కమిషనర్ రోనాల్ రోస్ తెలిపారు. ఎంసీసీ అమలులో భాగంగా ఇప్పటి వరకు 1,545 వాల్ రైటింగ్, 5,838 పోస్టర్లు, 6,937 బ్యానర్లు, 5,645 ఇతర మొత్తం 19,997 ప్రైవేట్ ఆస్తులకు సంబంధించినవి తొలగించినట్లు అదే విధంగా 169 వాల్ రైటింగ్, 1,365 పోస్టర్స్ 3,464 బ్యానర్లు 2,058 ఇతర ఆస్తులకు సంబంధించినవి మొత్తం 7,056 తొలగించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కమిషనర్ జిహెచ్‌ఎంసి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News