- Advertisement -
అమరావతి: విజయవాడ రైల్వేస్టేషన్ దగ్గర సిపిఎం నిరసన తెలిపింది. ఒడిశా రైళ్ల ప్రమాద బాధితులకు న్యాయం చేయాలని, కవచ్ లేకపోవడం వల్లే ప్రమాదం సంభవించిందని బాబురావు పేర్కొన్నారు. మృతులు కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. జెండా ఊపి వందేభారత్ రైళ్లను ప్రారంభించడం కాదని, ప్రజల ప్రాణాలను కాపాడాలని పిలుపునిచ్చారు. రైల్వేను ప్రైవేటీకరిస్తే ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. ఒడిశా రైల్వే ప్రమాదంలో 288 మృతి చెందగా 1000 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని రైల్వే శాఖ తెలిపింది. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.
Also Read: అర్థరాత్రి ఒంటరిగా అబల…. బైక్ ఫై పోకిరీలు… వీడియో చూస్తే మైండ్ బ్లాక్
- Advertisement -