Thursday, January 23, 2025

పద్మశ్రీ పురస్కార విజేతలకు రూ.25 వేల ఫెన్షన్: రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పద్మ శ్రీ పురస్కారాలకు ఎంపికైన ఒక్కొక్కరికి రూ.25 లక్షలు ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. పద్మపురస్కారాలకు ఎంపికైన వారికి శిల్పకళావేదికలో సన్మానించారు. పద్మ పురస్కారాలకు ఎంపికైన తెలుగువారు పద్మవిభూషణ్ గ్రహీతలు వెంకయ్యనాయుడు, చిరంజీవి, పద్మ శ్రీ గ్రహీతలు దాసరి కొండప్ప, గడ్డం సమ్మయ్య, ఆనందాచారి, కేతావత్ సోమ్‌లాల్, కూరెళ్ల విఠలాచార్య, ఉమామహేశ్వరిని ప్రభుత్వం తరుపున సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులు సన్మానించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రసంగించారు. పద్మ శ్రీ పురస్కార విజేతలకు ప్రతి నెల రూ.25 వేల ఫెన్షన్ ఇస్తామని ప్రకటించారు. పద్మ శ్రీ విజేతలకు రేవంత్ రెడ్డి రూ.25 లక్షల చెక్కులను అందజేశారు.

వెంకయ్యనాయుడు, చిరంజీవి చేతుల మీదుగా చెక్కులను బహూకరణ చేశారు. వెంకయ్యను సన్మానించడం మనల్ని మనమే సన్మాంచుకోవడమేనని రేవంత్ రెడ్డి ప్రశంసించారు. ఢిల్లీ వెళ్లే తెలుగు రాజకీయ నేతలకు వెంకయ్య నాయుడు పెద్ద దిక్కు అని కొనియాడారు. తెలుగు కళాకారులు ఎక్కడ ఉన్నా గౌరవించుకోవాలని సూచించారు. అప్పట్లో దివంగత మాజీ కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి, వెంకయ్య నాయుడు జంట కవుల్లా ఉండేవారని రేవంత్ రెడ్డి కొనియాడారు. అప్పట్లో జైపాల్ రెడ్డి, వెంకయ్య ప్రజల కోసం పరితపించేవారని గుర్తు చేశారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు రాష్ట్రపతి కావాలని ఆకాంక్షిస్తున్నానని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News