ముంబై: బాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటుడు సల్మాన్ ఖాన్. గడచిన మూడు దశాబ్దాల కాలంలో అతడి సంపద బాగా పెరిగింది. కానీ అతడు చాలా సాదాసీదాగా జీవిస్తుంటాడు. అతడి సినిమా ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ నేడు విడుదల అయింది. అతడి సినిమా చూడ్డానికి అభిమానులు ఎగబడుతున్నారు. అతడితో నటించిన ఇద్దరు నటులు ఆయన సింప్లీసిటీని చూసి ఎంతో పొగిడారు. ఇటీవల జరిగిన ఓ ప్రమోషనల్ ఇంటర్వూలో పలక్ తివారీ, జస్సీ గిల్ భాయ్‌జాన్ (సల్మాన్ ఖాన్) చిరిగిపోయిన బూట్లను సినిమా సెట్స్‌లో వేసుకుని తిరిగారన్నారు. అతడెంతగా డబ్బు తీసుకుంటున్నప్పటికీ చాలా సాదాసీదాగా జీవిస్తుంటాడని వారు చెప్పారు.
ఒకసారి పలక్ తివారీ ఆయన బూట్లకు రంధ్రాలు పడి ఉండడాన్ని గురించి అడిగితే, సల్మాన్ ఖాన్ ‘నాకున్న బూట్లలో ఎంతో సౌఖ్యవంతంగా ఉండే బూట్లు ఇవి. వీటికి మించి ఏవి నాకు బాగుండవు’ అన్నారు. దాంతో సల్మాన్ ఖాన్‌కు స్టయిల్ కన్నా సౌఖ్యమే మిన్న అని ఆమె తెలిపారు. దేశంలోని టాప్ దాతలలో సల్మాన్ ఖాన్ కూడా ఒకరని ఆమె అన్నారు. సల్మాన్ ఖాన్ సాదాసీదా జీవితం దినపత్రిక హెడ్‌లైన్స్‌లో కూడా వస్తుంటుంది. నేడాయన సినిమా విడుదల, ఎంత మందిని సినిమా హాళ్ల వైపు ఆకర్షిస్తారో ఈ ‘భాయ్‌జాన్’.