Wednesday, January 22, 2025

ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత..

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. బుధవారం విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో బ్యాంకాక్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడిని తనిఖీ చేసిన అధికారులు.. అతని వద్ద హెరాయిన్ గుర్తించారు. అక్రమంగా హెరాయిన్‌ను పాలిథిన్ కవర్‌లో ప్యాకింగ్ చేసి తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన హెరాయిన్ విలువ మార్కెట్ లో దాదాపు రూ.29.28 కోట్ల ఉంటుందని అధికారులు తెలిపారు.నిందితుడిని అదుపులోకి తీసుకున్న అధికారులు.. ఎన్డీపీఎస్ యాక్ట్‌ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News