Tuesday, November 5, 2024

రూ. 3.3 లక్షల కోట్ల విదేశీ రుణం కోసం అదానీ గ్రూపు యత్నాలు

- Advertisement -
- Advertisement -

 

న్యూఢిల్లీ: కార్మిషెల్ బొగ్గు గనులకు చెందిన ఆస్తులను తాకట్టు పెట్టి ప్రపంచ ఆర్థిక సంస్థల నుంచి రూ. 3.3 లక్షల కోట్లు(400 మిలియన్ డాలర్లు) రుణం పొందేందుకు గౌతమ్ అదానీ సారథ్యంలోని అదానీ గ్రూపు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రిసెర్చ్ విడుదల చేసిన నివేదిక దరిమిలా అదానీ గ్రూపు కంపెనీల షేర్ల మార్కెట్ విలువ గడచిన నెలరోజులలో రూ. 12 లక్షల కోట్లు(145 బిలియన్ డాలర్లు) నష్టపోయాయి.

అదానీ గ్రూపు కార్మిషెల్ బొగ్గు గనితోపాటు ఉత్తర క్వీన్స్‌ల్యాండ్ పోర్టును, ఆస్ట్రేలియాలో సోలార్ కంపెనీని కూడా నిర్వహిస్తోంది. సోమవారం వెలువడిన మీడియా కథనాల ప్రకారం కంపెనీకి అవసరమైన నిధుల కోసం అదానీ కుటుంబ ట్రస్టు అధీనంలో ఉన్న నార్త్ క్వీన్స్‌ల్యాండ్ పోర్టులోని బొగ్గు ఎగుమతి టెర్మినల్ ద్వారా విదేశీ రుణాన్ని పొందాలని భావిస్తోంది. రుణాల కోసం అనేక విదేశీ ఆర్థిక సంస్థలను అదానీ గ్రూపు సంప్రదిస్తున్నప్పటికీ ఇప్పటివరకు నుండే ఆర్థిక సంస్థల నుంచి సానుకూల స్పందన లభించింది. వీటిలో హెడ్జ్ ఫండ్ ఫరల్లాన్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ ఒకటని తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News