Wednesday, January 22, 2025

రూ. 3.63 కోట్లు నగదు స్వాధీనం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల సందర్భంగా పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో అదివారం ఉదయం 9గంటల నుంచి సోమవారం ఉదయం 9గంటల వరకు నిర్వహించిన సోదాల్లో రూ. 3.63 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు రూ. 2.08 కోట్ల విలువ చేసే 2190 లీటర్ల మద్యం సీజ్ చేశారు. రూ.71.02 లక్షల విలువ చేసే 3 కేజీల గంజాయి, 89 కిలోల ఇతర మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. రూ.14.08 లక్షల విలువ చేసే 0.84 కిలోల బంగారం, 12 కిలోల వెండిని సీజ్ చేశారు. ఓటర్లకు పంచి పెట్టడానికి సిద్ధం చేసి పెట్టుకున్న రూ.8.45 లక్షల విలువ చేసే చీరలు పట్టివేశారు.

ఇప్పటి వరకు రూ. 632 కోట్ల సొత్తు సీజ్:
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన అక్టోబర్ 9వ తేదీ నుంచి సోమవారం ఉదయం 9గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా అధికారులు సీజ్ చేసిన సొత్తు విలువ రూ. 632 కోట్లు దాటింది. దీంట్లో నగదు రూ.236 కోట్ల ఉండగా, రూ.101.57 కోట్ల విలువ చేసే మద్యాన్ని స్వాధీనం చేసు కున్నారు. రూ.35.06 కోట్ల విలువ చేసే మత్తు పదార్దాలను సీజ్ చేయటంతోపాటు రూ.181.05 కోట్ల విలువ చేసే బంగారం, వెండి, వజ్రాలను స్వాధీనం చేసుకున్నారు. రూ.78.70 కోట్ల రూపాయల విలువ చేసే కుక్కర్లు, చీరలు, ఇతర పరికరాలను సీజ్ చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News