- Advertisement -
కోల్కతా అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. గురువారం ఉదయం ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో విమాన క్యాబిన్ లో రూ.3కోట్లు విలువ చేసే 5.7కేజీల బంగారాన్ని అధికారులు గుర్తించారు. ఎయిర్ పోర్టులో తనిఖీ నిర్వహించడంతో దుబాయ్ నుంచి తీసుకువచ్చిన బంగారాన్ని కేటుగాళ్లు క్యాబిన్ లో వదిలిపెట్టి వెళ్లారు. బంగారాన్ని స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు.. నిందితుల కోసం ప్రయాణికుల వివరాలను సేకరిస్తున్నారు.
Rs 3 Cr worth Gold Seized at Kolkata Airport
- Advertisement -