Monday, December 23, 2024

అక్రమాలు నిరూపిస్తే రూ. 3లక్షల రివార్డు

- Advertisement -
- Advertisement -

పారదర్శకంగా పోలీస్ ఉద్యోగాలు

97వేల ధ్రువపత్రాలు పరిశీలించాం

నియామక మండలి బోర్డు చైర్మన్ శ్రీనివాస రావు

మన తెలంగాణ/సిటీబ్యూరో: పోలీసు నియామక ప్రక్రియ పారదర్శకంగా సాగుతోందని తెలంగాణ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు చైర్మన్ శ్రీనివాసరావు తెలిపారు. మూడు దశల్లో ఉద్యోగ నియామక ప్రక్రియ చేపట్టామని తెలిపారు. తుది పరీక్షలో అర్హత సాధించిన 97 వేల మందికిపైగా అభ్యర్థుల ధ్రువపత్రాలను గత నెలలో పరిశీలించామని తెలిపారు. ఎక్కడా అక్రమాలకు తావులేదని, జాగ్రత్తగా పరిశీలించామని అన్నారు. నియామకాల్లో ఎక్కడైనా అక్రమాలు జరిగినట్లు నిరూపించిన వారికి రూ.3లక్షలు పారితోషికం ఇ స్తామని చెప్పారు. పోలీస్ ఉద్యోగ ప్రకటనలో స్పష్టంగా పేర్కొన్నా కూడా వయస్సు, విద్యార్హత లేకున్నా కొందరు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. అలాంటి అభ్యర్థుల దరఖాస్తులను తిరస్కరించామని స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News