Thursday, January 23, 2025

హవాల నగదు సీజ్

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః బైక్‌పై తరలిస్తున్న హవాలా నగదును సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం సీజ్ చేశారు. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ.30,00,000లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం… ముషీరాబాద్‌కు చెందిన గంటయాల శ్రీనివాస్ రావు, శ్రీశైలం గౌడ్, సురేష్ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నారు. ముగ్గురు బైక్‌పై పది లక్షల చొప్పున విడదీసి తరలిస్తున్నారు. టాస్క్‌ఫోర్స్ పోలీసులు రేయిన్‌బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బడా బజార్ వద్ద వాహనాల తనిఖీ చేస్తున్నారు. ఈ సమయంలోనే ముగ్గురు రావడంతో తనిఖీ చేయగా నగదు లభించింది. వాటికి సంబంధించిన వివరాలు అడుగగా సమాధానాలు ఇవ్వలేదు. దీంతో నగదును సీజ్ చేసి రెయిన్ బజార్ పోలీసులకు అప్పగించారు. ఇన్స్‌స్పెక్టర్ అజయ్‌కుమార్, ఎస్సైలు నర్సింహులు, ఆంజనేయులు, నవీన్ కలిసి పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News