Saturday, November 23, 2024

పర్యాటక రంగానికి కేంద్ర నుంచి రూ.300 కోట్లు విడుదల…

- Advertisement -
- Advertisement -

రాష్ట్ర పర్యాటక మౌలిక వసతుల కల్పన కోసం కేంద్రం నుంచి రూ. 300 కోట్ల నిధులు
స్వదేశ్ దర్శన్ పథకం కింద రూ. 268.39 కోట్లు, ప్రసాద్ పథకం కింద రూ. 36.73 కోట్లు
కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడి

Kishan Reddy said vaccine testing centre will be set up in hyderabad

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధి కోసం మౌలిక సదుపాయాల కల్పన కోసం కేంద్రం రూ. 300 కోట్ల మేరకు నిధులను మంజూరు చేసింది. ఇందులో స్వదేశ్ దర్శన్ పథకం కింద రూ. 268.39 కోట్లు, ప్రసాద్ కింద రూ.36.73 కోట్ల మేర నిధులను మంజూరు చేసింది. ఈ విషయాన్ని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి వెల్లడించారు.

స్వదేశ్ దర్శన్ పథకంలో రాష్ట్రంలో 3 పర్యాటక సర్క్యూట్స్ అభివృద్ధికి రూ.268.39 కోట్లను వెచ్చించనున్నారు. అలాగే ప్రసాద్ పథకం కింద రూ.36.73 కోట్లను ఖర్చు చేయనుంది. బిజెపి తెలంగాణ అధ్యక్షులు, కరీంనగర్ ఎంపి బండి సంజయ్ కుమార్ రాసిన లేఖకు సమాధానమిస్తూ జి.కిషన్‌రెడ్డి ఈ వివరాలు వెల్లడించారు.

మహబూబ్ నగర్ జిల్లాలోని ఎకో సర్క్యూట్ కోసం 2015..20-16లో రూ.91.62 కోట్లు, ములుగు-…లక్నవరం…-మేడారం..-తాడ్వయి-…దామరవి..-మల్లూరు-..బొగత జలపాతంను కలుపుతూ ట్రైబల్ సర్క్యూట్ కింద చేపట్టనున్న అభివృద్ధి పనులకు 2016-..2017లో రూ.79.87 కోట్లు, కుతుబ్ షాహీ హెరిటేజ్ పార్క్….-పైగాటూంబ్స్…- హయత్ బక్షి మస్క్… -రేమండ్స్ టూంబ్ లను కలుపుతూ హెరిటేజ్ సర్క్యూట్ కింద చేపట్టనున్న అభివృద్ధి పనులకు 2017-..2018లో రూ.96.90 కోట్లు మంజూరు చేసినట్టు లేఖలో పేర్కొన్నారు.

ప్రసాద్ పథకం కింద ఆలంపూర్‌లోని జోగులాంబ దేవి అమ్మవారి ఆలయం అభివృద్ధికి 2020..20-21లో రూ.36.73 కోట్లు మంజూరు చేసినట్టు తెలిపారు. రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధికి మరిన్ని నిధులు మంజూరు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, కేంద్ర మార్గదర్శకాలను అనుసరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తగిన ప్రతిపాదనలు పంపిస్తే, వాటిని సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని కేంద్రమంత్రి లేఖలో పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News