Wednesday, November 6, 2024

అనర్హులకు రూ.3వేల కోట్ల పిఎం కిసాన్ నిధులు

- Advertisement -
- Advertisement -

Rs 3000 crore PM Kisan funds to over ineligible

42 లక్షల మంది అనర్హులకు రూ.3వేల కోట్ల పిఎం కిసాన్ నిధులు
రికవరీ చేయాల్సి ఉందని పార్లమెంట్‌లో ప్రభుత్వం ప్రకటన
న్యూఢిల్లీ: పిఎం కిసాన్ పథకం క్రింద దాదాపు 42లక్షల మంది అనర్హులు రూ.3,000 కోట్ల మేరకు పొందినట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. అనర్హులకు చేరిన ఈ నిధులను తిరిగి రాబట్టవలసి ఉందని కేంద్ర ప్రభుత్వం మంగళవారం పార్లమెంటుకు తెలిపిం ది. పిఎంకిసాన్ పథకం క్రింద ఒక్కొక్క రైతుకు సంవత్సరానికి రూ.6,000 చొప్పున కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న సంగతి తెలిసిందే. ఈఆదాయపు పన్ను చెల్లించేవారు ఈ పథకం క్రింద లబ్ధి పొందడానికి అనర్హులు. వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పార్లమెంటులో మంగళవారం ఓ ప్రశ్నకు సమాధానం చెప్తూ, పిఎం-కిసాన్ స్కీమ్ క్రింద సొమ్ము తీసుకున్న అనర్హులైన 42.16 లక్షల మంది నుంచి రూ.2,992 కోట్లు రాబట్టవలసి ఉందని చెప్పారు. అస్సాంలో 8.35 లక్షల మంది అనర్హులు రూ.554 కోట్లు పొందారని తెలిపారు. తమిళనాడులో 7.22 లక్షల మంది రూ.340 కోట్లు, పంజాబ్‌లో 5.62 లక్షల మంది రూ.437 కోట్లు, మహారాష్ట్రలో 4.45 లక్షల మంది రూ.358 కోట్లు, ఉత్తర ప్రదేశ్‌లో 2.65 లక్షల మంది రూ.258 కోట్లు, గుజరాత్‌లో 2.36 లక్షల మంది రూ.220 కోట్లు అక్రమంగా పొందారని తెలిపారు.

పిఎం కిసాన్ పథకం అమలులో తప్పులను నివారించేందుకు ఆధార్, పిఎఫ్‌ఎంఎస్, ఆదాయపు పన్ను శాఖ డేటాబేస్ వంటివాటిని ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. కొందరు అనర్హులకు ఈ పథకం లబ్ధి చేరినట్లు తనిఖీల్లో తేలిందన్నారు. ఆదాయపు పన్ను చెల్లించేవారు కూడా ఈ నిధులను పొందినట్లు వెల్లడైందని చెప్పారు. ఈ పథకం క్రింద నిధులను దుర్వినియోగపరచడానికి వీల్లేకుండా కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. అసలు సిసలు రైతులు మాత్రమే లబ్ధి పొందే విధంగా ఈ పథకాన్ని అమలు చేయడానికి చర్యలు తీసుకున్నామన్నారు.కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే అక్రమ లబ్ధిదారులకు నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు.

Rs 3000 crore PM Kisan funds to over ineligible

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News