Monday, December 23, 2024

ఒకేరోజు రూ. 3000కోట్లు

- Advertisement -
- Advertisement -
64.52లక్షల టన్నుల ధాన్యం సేకరణ పూర్తి
ఈ నెల 20నాటికి మొత్తం నిధులు జమ
జాతీయ స్థాయిలో ప్రధమస్థానం పొందిన తెలంగాణ: మంత్రి గంగుల

హైదరాబాద్: రాష్ట్రంలో యాసంగి ధాన్యం సేకరణకు సంబంధించి ముఖ్యమంత్రి కేసిఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వం రైతులకు అన్ని విధాల అండగ నిలిచిందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ప్రకృతి వైపరిత్యాలకు ఎదురెళ్లి ధాన్యం సేకరణ చేశామని తెలిపారు. గురువారం ఒక్కరోజే ధాన్యం సేకరణకు సబంధించి రైతుల ఖాతాలకు రూ.3000కోట్లు విడుల చేశామని వెల్లడించారు. మిగిలిన మొత్తాన్ని ఈనెల 20నాటికి రైతులకు అందేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. ఈ యాసంగి ధాన్యం సేకరణకు సబంధించి గురువారం వరకూ 65.10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 11 లక్షల మంది రైతుల నుండి సేకరించామని వీటి విలువ 13,383 కోట్లన్నారు.

ఇందులో ఓపీఎంఎస్‌లో నమోదు చేసిన 10,439 కోట్లలో 9,168 కోట్లను రైతులకు అందించామన్నారు. అకాల వర్షాల వంటి విపత్కర పరిస్థితులను ముందుగా అంచనా వేసి పదిరోజులు ముందుగానే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గతంలో కన్నా అధికంగా 7037 కొనుగోలు కేంద్రాలను తెరిచి రైతు చెంతకే వెళ్లి ధాన్యం సేకరణ చేసామని, ఇప్పటికే 90శాతానికి పైగా సేకరణ పూర్తయిందని ,ఇప్పటివరకూ 6366 ధాన్యం కొనుగోలు కేంద్రాలను మూసి వేసామన్నారు. రాష్ట్రంలోని 18 జిల్లాల్లో సంపూర్ణంగా ధాన్యం సేకరణ పూర్తయిందని, మిగతా జిల్లాల్లోనూ ఆదివారం వరకూ పూర్తి చేస్తామన్నారు.

ఎక్కడైనా ఆలస్యంగా కోతలు చేసిన ప్రాంతాల రైతుల ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకొని కొనుగోళ్లు చేసేందుకు వీలుగా కలెక్టర్లకు నిర్ణయాధికారం ఇచ్చామని వెల్లడించారు. గత సీజన్ కన్నా 16లక్షల మెట్రిక్ టన్నులను అధికంగా సేకరించామని మంత్రి గంగుల తెలియజేసారు. సీఎం కేసీఆర్ రైతు అనుకూల విధానాలు రైతుబంధు, 24 గంటల ఉచిత కరెంటు, అందుబాటులోకి సమృద్దిగా జలాలు, చెంతకే వెళ్లి మద్దతు ధరతో కొనుగోళ్లు వంటి కారణాలతో కేవలం తొమ్మిదేళ్లలోనే దేశానికి అన్నపూర్ణగా మారి, యాసంగి ధాన్యం సేకరణలో తెలంగాణ రాష్ట్రం దేశంలో నెంబర్ వన్ గా నిలిచిందన్నారు.

రాష్ట్రంలో 56.845 లక్షల ఎకరాల్లో వరిపంట సాగైందని, ఎర్రటి ఎండల్లోనూ ఓవైపు ఇంత పెద్ద ఎత్తున పంటను సేకరిస్తూనే మరోవైపు అకాల వర్షాల నుండి అన్నదాతను కాపాడేందుకు పౌరసరఫరాల యంత్రాంగం మొత్తం క్షేత్ర స్థాయిలోనే ఉండి రైతులకు అండగా నిలిచిందన్నారు. అవసరమైన మేర టార్పాలిన్లు అందుబాటులో ఉంచడంతో పాటు పెద్ద ఎత్తున తెరిచిన సేకరణ కేంద్రాలకు అవసరమైన మాయిశ్చర్ మిషన్లు, వెయింగ్ మిషన్లు, ప్యాడీక్లీనర్లు వంటి మౌళిక వసతులను ప్రభుత్వం సమకూర్చిందన్నారు. తడిసిన ధాన్యాన్ని సైతం సేకరించామని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. యాసంగి ధాన్యం సేకరణలో పాల్గొన్న హమాలీలకు , సహకార సంఘాలకు ,మిల్లర్లకు , అధికార యంత్రాగానికి , మంత్రి గంగుల కమాలకర్ , రాష్ట పౌరసరఫరాల సంస్థ చైర్మన్ రవీందర్ సింగ్ కృతజ్ణతలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News