Monday, December 23, 2024

ప్రభుత్వ ఉద్యోగులకు శిక్షణ కోసం రూ.309.74 కోట్లు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : బడ్జెట్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు శిక్షణ కోసం కేంద్ర సిబ్బంది మంత్రిత్వశాఖకు రూ. 309.74 కోట్లు కేటాయించారు. కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్స్ మంత్రిత్వశాఖకు కేటాయించే రూ. 2328.56 కోట్ల పద్దు కింద నిధులు లభిస్తాయి.

కేటాయించిన రూ. 309.74 కోట్లలో 103.05 కోట్లు ట్రయినింగ్ డివిజన్, ఇనిస్టిట్యూట్ ఆఫ్ సెక్రటేరియట్ ట్రైనింగ్, అండ్ మేనేజిమెంట్ (ఐఎస్‌టిఎం), లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ (ఎల్‌బిఎస్‌ఎస్‌ఎన్‌ఎ)కు వర్తిస్తాయి. రూ.120.56 కోట్లు ట్రైనింగ్ స్కీమ్స్‌కు, రూ.86.13 కోట్లు నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ సివిల్ సర్వీసెస్ కెపాసిటీ బిల్డింగ్ లేదా మిషన్ కర్మయోగికి వర్తిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News