Sunday, December 22, 2024

నిర్మలా సీతారామన్‌కు మహువా మోయిత్రా ట్వీట్!

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: తృణమూల్ పార్లమెంటు సభ్యురాలు మహువా మోయిత్రా కేంద్ర ఆర్థిక మంత్రిని ఉద్దేశించి ట్వీట్ చేశారు. జీవిత బీమా సంస్థ(ఎల్‌ఐసి) పెట్టుబడిని అదానీ గ్రూప్‌లో పెట్టి తొలిసారి నష్టం చవిచూసిందన్నారు. కొనుగోలు ధర కన్నా 11 శాతం కిందికి తొలిసారి పడిపోయిందన్నారు. ఇప్పుడది రూ. 27000కోట్ల కన్నా కింద స్థిరపడిందన్నారు.

‘అదానీ షేర్లలో ఇప్పటి వరకు రూ. 3200 కోట్ల నష్టం వాటిల్లింది. నిర్మలా సీతారామన్…భారతీయుల డబ్బుతో అదానీకి మద్దతు ఇవ్వడానికి నీమీద ఎలాంటి ఒత్తిళ్లు పనిచేస్తున్నాయి’ అని ఆమె శుక్రవారం ట్వీట్ చేశారు. తన వాదనకు మద్దతుగా మహువా మోయిత్రా ఓ న్యూస్ రిపోర్ట్ స్క్రీన్ షాట్‌ను కూడా షేర్ చేశారు.అదానీ గ్రూప్‌కు చెందిన ఐదు కంపెనీలు…అదానీ ఎంటర్‌ప్రైజెస్, టోటల్ అదానీ గ్యాస్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ట్రాన్స్‌మిషన్, అదానీ పోర్ట్ ప్రశ్నార్థకంగా మారాయని ఆ న్యూస్ రిపోర్ట్ పేర్కొంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News