Friday, November 22, 2024

కరోనా వ్యాక్సినేషన్‌కు రూ.35 వేల కోట్లు

- Advertisement -
- Advertisement -

Rs 35,000 crore for Corona vaccination

 

ఆరోగ్య రంగానికి కేటాయింపులు 137% పెంపు

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారితో దేశం కుదేలైన వేళ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి పెద్ద పీట వేశారు. ముఖ్యంగా కరోనా వ్యాప్తిని కట్టడి చేసే వ్యాక్సినేషన్ ప్రక్రియకు రూ.35,000 కోట్లు కేటాయిస్తున్నట్లు ఆమె ప్రకటించారు. ‘ కరోనాపై పోరులో భాగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియకోసం రూ.35 వేల కోట్లు కేటాయిస్తున్నాం. 2021 22ఆర్థిక సంవత్సరంలో 68.6 కోట్ల జనాభాకు డోసుకు రూ.255 చొప్పున రెండు డోసులు ఇవ్వాలని లక్షంగా పెట్టుకున్నాం. ఒక వేళ డోసుల ధర పెరిగితే కేటాయింపులు కూడా పెంచుతాం’ అని మంత్రి చెప్పారు. కొవిడ్ విజృంభణ సమయంలో వైద్య సదుపాయాలపరంగా ఎదుర్కొన్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఈ రంగానికి కేటాయింపులు పెంచారు. ‘ ఆత్మనిర్భర్ ఆరోగ్య పథకానికి మొత్తం రూ.2,23,846కోట్లు కేటాయించినట్లు నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు.నివారణ, చికిత్స. సంపూర్ణ ఆరోగ్య విధానంతో ఈ పథకాన్ని రూపొందించినట్లు తెలిపారు.

గత ఏడాది ఈ రంగానికి రూ.94,452 కోట్లు మాత్రమే కేటాయించగా, వచ్చే ఆర్థిక సంవత్సరంలో కేటాయింపులను 137 శాతం పెంచారు. దేశంలో 9 బిఎస్‌ఎల్3 స్థాయి ప్రయోగ శాలలు, 15 అత్యవసర ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దేశంలోని అన్ని జిల్లాల్లోను సమీకృత వ్యాధి నిర్ధారణ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అలాగే దేశంలో కొత్తగా నాలుగు ప్రాంతీయ వైరల్ ల్యాబ్‌లను ఏర్పాటు చేయనున్నటుల ఆర్థిక మంత్రి తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో రక్షిత మంచినీటి కోసం ప్రధాని జల్‌జీవన్ మిషన్ అర్బన్‌ను ప్రారంభించనున్నట్లు తెలిపారు.ఈ పథకం ద్వారా 87 వేల కోట్ల రూపాయలతో 500 మురుగు శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. రక్షిత మంచినీటి పథకాల కోసం రూ.87 వేల కోట్లు, స్వచ్ఛ భారత్ మిషన్ కోసం లక్షా 41 వేల 678 కోట్లను బడ్జెట్‌లో కేటాయించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News