Monday, December 23, 2024

స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఎపి స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో రూ.371 కోట్ల అవినీతి జరగిందని ఎపి సిఐడి ఎడిజి సంజయ్ అన్నారు. ప్రభుత్వ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డితో కలిసి హైదరాబాద్‌లో గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కుంభకోణంలో మొత్తం 10 కీలకాంశాలు వున్నాయన్నారు. నిబంధనలకు విరుద్ధంగా రూ.371 కోట్లను రిలీజ్ చేశారని పేర్కొన్నారు. అధికారుల అభ్యంతరాలను నాటి ప్రభుత్వం పట్టించుకోలేదని ఆయన తెలిపారు. తప్పుడు డాక్యుమెంట్స్‌తో ఒప్పందాలు చేసుకున్నారని ఆరోపించారు. ప్రభుత్వ జీవోలకు, అగ్రిమెంట్‌కు చాలా తేడాలు వున్నాయని వెల్లడించారు. అగ్రిమెంట్‌లో జివొ నెంబర్‌ను చూపించలేదని, జివొలో వున్న అంశాలు అగ్రిమెంట్‌లో లేవని ఆయన పేర్కొన్నారు.

జివొ కంటే ముందే అగ్రిమెంట్ తయారైందని చెప్పారు. ఇకపోతే బుధవారం సంజయ్ మీడియాతో మాట్లాడుతూ క్యాబినెట్ అనుమతి లేకుండానే స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశారని తెలిపారు. క్యాబినెట్ అనుమతి లేకుండానే స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారని తెలిపారు. అంతేకాదు, కార్పొరేషన్ ఏర్పాటులోనూ విధి విధానాలు పాటించలేదని వివరించారు. ఈ కార్పొరేషన్ నుంచి ప్రైవేటు వ్యక్తులకు డబ్బులు వెళ్లాయని, ఆ ప్రైవేట్ వ్యక్తుల నుంచి షెల్ కంపెనీలకు మళ్లాయని వెల్లడిం చారు. అప్పటి ఎపి ప్రభుత్వం జర్మనీ కంపెనీ సీమెన్ కంపెనీతో ఒప్పందం చేసుకుందని సంజయ్ తెలిపారు. అగ్రిమెంట్ రూ. 371 కోట్ల ప్రస్తావన మాత్రమే ఉన్నదని వివరించారు. కానీ, జివొ అందుకు విరుద్ధంగా తీసుకువచ్చారని చెప్పారు. జీవో 90 శాతం, 10 శాతం విధానంలో ఫండింగ్ ఉంటుందని పేర్కొన్నారు.

అగ్రిమెంట్‌లో మాత్రం 90 శాతం, 10 శాతం ప్రస్తావనే లేదని వివరించారు. ఈ విషయాన్ని సీమెన్ కంపెనీనే స్వయంగా ధ్రువపరిచిందని తెలిపారు. ఈ జీవో దురుద్దేశాన్ని స్పష్టం చేస్తున్నదని ఆరోపించారు. పూర్తి వివరాలు సీమెన్ కంపెనీకి వెల్లడించ లేదన్నారు. జివొల్లో 13 చోట్ల సిఎంగా చంద్రబాబు సంతకం ఉన్నదని వివరించారు. బడ్జెట్ అప్రూవ్ చేయడానికి కౌన్సిల్ సమావే శానికి కూడా చంద్రబాబు సంతకం ఉన్నదని వెల్లడించారు. స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు గంటా సుబ్బారావు అనే ప్రైవేటు వ్యక్తిని నియమించారని, ఆయనకు చాలా పదవులు కట్టబెట్టారని వివరించారు. ఒకే వ్యక్తికి మూడు బాధ్యతలు అప్పగించారని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News