Wednesday, December 25, 2024

ఆర్టీసికి రూ.374 కోట్లు విడుదల… భట్టి తొలి సంతకం…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ సచివాలయంలో ఆర్ధిక, ప్రణాళిక, విద్యుత్ మంత్రిత్వ శాఖల బాధ్యతలను డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క మల్లు స్వీకరించారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు కల్పిస్తున్న ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం సబ్సిడీని 374 కోట్ల రూపాయలు ఆర్టీసీకి విడుదల చేస్తూ డిప్యూటీ సిఎం భట్టి తొలి సంతకం చేశారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ సాయాన్ని 10 లక్షలకు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా 298 కోట్ల రూపాయలను వైద్య ఆరోగ్య శాఖకు విడుదల చేస్తూ రెండవ సంతకం చేశారు. విద్యుత్ సబ్సిడీ 996 కోట్ల రూపాయలు విడుదల ఫైలుపై సంతకం చేశారు. సమ్మక్క సారక్క జాతర ఏర్పాట్ల కొరకు 75 కోట్ల రూపాయలు వివిధ శాఖల మంజూరుకు సిఫారసు చేసిన ఫైలుపై సంతకం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News