- Advertisement -
24 గంటల్లో రూ.13.86 కోట్లు
మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల నేపథ్యంలో చేపడుతున్న తనిఖీల్లో భాగంగా శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి శనివారం ఉదయం 9 గంటల వరకు 24 గంటల్లో రూ.13.86 కోట్ల సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఇందులో రూ.5,32,35,488 నగదును, రూ. 28,84,54,713(90999.01 లీటర్ల) లక్షల విలువైన మద్యం, రూ.58,27,850 (83.816కిలోల గంజాయి&43.75 కిలోలఎన్ డీపీఎస్), రూ.19,13,370(0.150 కిలోలబంగారం, 14.69కిలోల వెండి), రూ.1,65,42,340 ( చీరలు -146, మొబైల్స్- 4వేలు) ఇతరములు విలువైన వస్తు సామగ్రి ఉన్నాయని తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి కార్యాలయం వెల్లడించింది. ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్న మొత్తం సొత్తు విలువ రూ.3,77,68,57,542 కోట్లకు చేరింది.
- Advertisement -