Monday, December 23, 2024

మూసీ శుద్ధికి రూ.3,849 కోట్లు మంజూరు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/సిటీ బ్యూరో: మూసీనదిలోకి మురుగు చేరడాన్ని తగ్గించేందుకు ప్రత్యేకంగా మురుగు శుద్ది కేంద్రాలు(సీవేట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌ఎస్ టిపి)లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ప్రభుత్వం జీఓను శనివారం విడుదల చేసింది. జీహెచ్‌ఎంసి, ఓఆర్‌ఆర్ లోపలి వైపు ఉన్న గ్రామాలు, పట్టణాలు, నగరాల మధ్యఎస్‌టిపిలను నిర్మించేందుకు అంచనా వ్యయం రూ.3849.10 కోటతో మూడు ప్యాకేజీలుగా 39 ఎస్‌టిపిలను ని ర్మించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.

జీహెచ్‌ఎంసి విస్తరిత ప్రాంతాన్ని ఔటర్ రింగ్ రోడ్ వరకు పొడిగించాలని నిర్ణయించిన నేపథ్యంలో మూసీనది ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం భావిస్తుంది.. అమృత్ 2.0 (ట్రెంచీ3) కింద నిర్మించనున్న ఈ ఎస్‌టిపిలలో ఒకటి మాత్రం పిపిపి విధానంలో నిర్మించనున్నట్టు ప్రభుత్వ ఆదేశాల్లో తెలిపింది. మూసీ రివర్‌ఫ్రంట్, మూసీ క్లీనప్‌లో భా గంగా హైదరాబాద్ సమూహం(హైదరాబాద్ అగ్లోమోరేషన్) క్రింద మిగతా 38 ఎస్‌టిపిలలో ఒకటవ ప్యాకేజీలో 16, రెండవ ప్యాకేజీలో 22 మొత్తం 39 మురుగు నీటి శుద్ధి కేంద్రాలు నిర్మించనున్నట్టు వెల్లడించింది.

39 ఎస్‌టిపిలు ఇలా
పిపిపి విధానంలో నిర్మించే ఎస్‌టిపి వ్యయం 15 ఏండ్లు నిర్వహణ, కార్యకలాపాలతో కలిపి రూ. 64.11 కోట్లు. ఇందులో కేంద్రం వాటాగా రూ.15.41 కో ట్లు. రాష్ట్ర వాట రూ.15.41కోట్లు. పిపిపి వాటా రూ. 20.55 కోట్లు. స్థానిక సం స్థ వాటా నిర్వహణ, కార్యకలాపాలు 15 సంవత్సరాలు కలిపి రూ. 12. 74 కోట్లుగా ప్రభుత్వం నిర్ణయించింది. ప్యాకేజీ1లో భాగంగా 16 ఎస్‌టిపిల అంచనా వ్యయం రూ. 1878.55 కోట్లు. ఇందులో కేంద్రం వాట రూ. 312.98 కోట్లు. రాష్ట్ర వాట రూ.438.18 కోట్లు. హైదరాబాద్ అగ్లోమెరేషన్ మూసీరివర్‌ఫ్రంట్‌మూసీ క్లీన్‌అప్(హెచ్‌ఏఎం) వాటా రూ.500.75 కోట్లు.

స్థానిక సంస్థ 16 సంవత్సరాల నిర్వహణ, కార్యకలాపాలతో కలిపి వాటా రూ.626.65 కోట్లు. ప్యాకేజీ2లో నిర్మించనున్న 22 ఎస్‌టిపిల అంచనా వ్యయం రూ. 1906.44 కోట్లు. ఇందులో కేంద్రం వాటా రూ. 316.64 కో ట్లు. రాష్ట్ర వాట 443.31 కోట్లు. హెచ్‌ఏఎం వాటా రూ.506.60 కోట్లు. స్థాని క సంస్థ వాటా రూ.639.90 కోట్లు.అని ప్రభుత్వం జారీచేసిన ఆదేశాల్లో వివరించింది.

జిహెచ్‌ఎంసి. ఓఆర్‌ఆర్ విస్తరిత ప్రాంతం 1984.44 చ.కి.మీ.లు
గ్రేటర్ హైదరాబాద్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ వరకు 33 గ్రామాలు, 20 మునిసిపాలిటీలు, 7 మునిసిపల్ కార్పోరేషన్లు ఉన్నాయి. ప్రస్తుతం జీహెచ్‌ఎంసి వి స్తరిత ప్రాంతం 650 చ.కి.మీలు. ఇప్పుడు జీహెచ్‌ఎంసిలో విలీనమయ్యే 7 మునిసిపల్ కార్పొరేషన్ల విస్తరిత ప్రాంతం 233.98 చ.కి.మీ.లు. 20 మునిసిపాలిటీల విస్తరిత ప్రాంతం 714.18 చ.కి.మీలు. 33 గ్రామపంచాయితీల ప్రాంతం 386.28 చ.కి.మీ.లుగా ఉన్నది. ఇవి విలీనమైతే జీహెచ్‌ఎంసి విస్తరిత ప్రాంతం మొత్తం 1984.44 చ.కి.మీ.లుగా పెరుగనున్నది.

ప్రస్తుతం సుమారు జీహెచ్‌ఎంసి జనాభ ఒక కోటి(1.02 కోట్లు) 02 లక్షలు, మునిసిపాలిటీలు, మునిసిపల్ కార్పోరేషన్ల(20+7) జనాభ 21,27,858 ఉండగా గ్రా మపంచాయతీలు(33) 1,72,836లు ఇక వీటన్నింటిని కలిపితే జీహెచ్‌ఎంసి మొత్తం జనాభ ఒక కోటి 25 లక్షలు(1.25 కోట్లు)గా ఉండనున్నది. వీటి నుంచి వెలువడే మురుగును శుద్ది చేసిన అనంతరం ఆ నీటిని వరదకాలువల ద్వారా, నాలాల నుంచి మూసీనదిలోకి చేరేలా ప్రభుత్వం ఎస్‌టిపిలను నిర్మిస్తుందని అధికారులు వివరిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News