Saturday, April 5, 2025

రాష్ట్ర సరిహద్దుల్లో రూ. 4.58 లక్షలు సీజ్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న అంతర్రాష్ట్ర చెక్‌పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా మహారాష్ట్ర నుంచి హైదరాబాద్‌కు కారులో తరలిస్తున్న రూ.4 లక్షలను పోలీసులను స్వాధీనం చేసుకున్నారు. 65వ నంబర్ జాతీయ రహదారిపై చిరాక్‌పల్లి శివారులో ఏర్పాటు చేసిన అంతర్రాష్ట్ర పోలీస్ చెక్‌పోస్టు వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో మహారాష్ట్రకు చెందిన బిందాస్ రూ. 4 లక్షలు తరలిస్తున్నట్లు గుర్తించారు. కర్నాటకకు చెందిన సలావుద్దీన్ కారులో రూ. 58వేలు తరలిస్తుండగా చెక్‌పోస్ట్ వద్ద పట్టుకున్నారు. ఎలాంటి పత్రాలు చూకపోవడంతో నగదును సీజ్ చేశారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కోడ్ అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే. నిబంధనల ప్రకారం రూ. 50వేలకు మించి నగదును తరలించే సమయంలో తప్పనిసరిగా పత్రాలను చూపించాల్సిందేనని పోలీసులు సూచిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News