Friday, November 15, 2024

రూ. 40 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

- Advertisement -
- Advertisement -

దమ్మపేట: అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు కృషితో కొత్తగా ఏర్పాడ్డ పంచాయతీలకు పంచాయతీ రాజ్ శాఖ నుంచి రూ. 1.60 కోట్లతో 8భవనాలు,ఐటిడిఏ శాఖ ద్వారా రూ. 1.20 లక్షలతో ఆరు భవనాలు మంజూరు కాగా శనివారం దమ్మపేట మండలం సీతారాంపురం, అల్లిపల్లి గ్రామాల్లో రూ.20లక్షల చొప్పున రూ.40లక్షలతో నిర్మించనున్న నూతన పంచాయతీ భవనాలకు ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు. అనంతరం రెండు గ్రామాల గ్రామస్థులతో ఆత్మీయంగా మాట్లాడుతూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

సీతారాంపురం గ్రామంలో గ్రామస్థులు మాట్లాడుతూ మాకు చాలా సంతోషంగా ఉందని, అన్ని వీధుల్లో సిసి రోడ్లు పోసి ప్రధాన సమస్యను తీర్చారని, అలాగే గుండె పట్వారిగూడెం – సీతారాంపురం రోడ్డు కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లో సమస్యలు పరిష్కరించడం తన బాథ్యత అని దాదాపుగా అన్ని వీధుల్లో సిసి రోడ్లు పోయటం జరిగిందని, మిగిలి ఉన్న వీధుల్లో కూడా త్వరలో పోయిస్తానని, గుండె పట్వారిగూడెం – సీతారాంపురం రూ. 1 కోటి రూపాయలతో బీటీ రోడ్డు మంజూరు చేయటం జరిగిందని, టెండర్ ప్రక్రియ కూడా పూర్తయిందని, త్వరలో పనులు ప్రారంభించనున్నారని తెలిపారు. అల్లిపల్లి గ్రామస్థులు మాట్లాడుతూ గ్రామంలో అన్ని వీధుల్లో సిసి రోడ్లు అయిపోయాయని పంచాయతీ భవనం కూడా వచ్చిందని మీరు వచ్చాకే గ్రామంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి జరిగిందని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో జట్పిటిసి పైడి వెంకటేశ్వరరావు, ఎంపిపి సోయం ప్రసాద్, వైస్ ఎంపిపి దారా మల్లిఖార్జునరావు, మండల బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు దొడ్డాకుల రాజేశ్వరరావు, సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, నాయకులు, మహిళా నాయకురాలు, వార్డు మెంబర్లు, అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News