Friday, December 20, 2024

రూ.400 కోట్లకు టోకరా

- Advertisement -
- Advertisement -

సోషల్ మీడియా లింకులతో ఘరానా మోసం

ఆ మొత్తం విదేశాలకు బదిలీ, ముంబైలో నిందితుడి పట్టివేత

మన తెలంగాణ/హైదరాబాద్: సోషల్ మీడియాలో లింకులతో ఏకంగా రూ.400 కోట్లు కొ ట్టేశాడో కేటుగాడు. కొట్టేసిన రూ.400 కోట్లను విదేశాలకు తరలించాడు. సైబర్ మోసగాడు రోనాక్ భరత్ కాకడేను ముంబైలో హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. దేశవ్యాప్తం గా ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్‌లలో ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో సైబర్ మోసాలు జరుగుతున్నాయి. రా ష్ట్రం నుంచి రోజుకు లక్షల్లో సైబర్ చీటర్స్ కాజేస్తున్నారు. దేశంలో ఉన్న అనేకమంది అకౌంట్ల వివరాలు సేకరించిన నిందితుడు వందల సం ఖ్యలో ఏజెంట్ల ద్వారా నకిలీ ఖాతాలు క్రియేట్ చేయించాడు. సైబర్ క్రైమ్ ద్వారా వచ్చిన డబ్బు ను నిందితుడు అకౌంట్లకు బదిలీ చేయించాడు. ఈ ఖాతాల నుంచి చైనా, తైవాన్‌లలో ఉన్న వా రికి బదిలీ చేశారు. కోట్ల రూపాయలను బిట్‌కాయిన్ రూపంలో, నకిలీ ఖాతాల ద్వారా బదిలీ చేశారు. హైదరాబాద్‌కు చెందిన ఒక బాధితుడి ఫిర్యాదుతో ఈ మోసం వెలుగుచూసింది. ముంబైలో రోనాక్‌ను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. దేశవ్యాప్తంగా ఇతని మోసాలపై 50కి పైగా కేసులు నమోదయ్యాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News