Monday, January 20, 2025

హై లెవల్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.45 కోట్లు మంజూరు

- Advertisement -
- Advertisement -

కల్వకుర్తి రూరల్ : నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం రఘుపతి పేట, రామగిరి గ్రామంలోని దుందు భి నదిపై హై లెవల్ బ్రిడ్జి నిర్మాణం కోసం 45 కోట్ల రూపాయ లు మంజూరయ్యాయని నాగర్‌కర్నూల్ పార్లమెంట్ సభ్యులు పోతుగంటి రాములు తెలిపారు. మంగళవారం నిధులకు సం బంధించి ప్రొసిడింగ్‌ను విడుదల చేయడం పట్ల సిఎం కెసిఆర్ కు ఎంపి రాములు ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భ ంగా ఎంపి రాములు మాట్లాడుతూ వంతెన నిర్మాణం వల్ల కల్వకుర్తి, తెలకపల్లి ప్రజల చిరకాల కోరిక నెరవేరుతుందని అన్నా రు. రఘుపతిపేట నుంచి దుందుభి నదిపై బ్రిడ్జ్ లేకపోవడం వలన వర్షాకాలంలో రవాణా సౌకర్యం కల్వకుర్తి నుంచి తెలకపల్లి వరకు పూర్తిగా స్తంభించి పోవడం జరుగుతుందన్నారు. దీని వల్ల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు.
త్వరలో నిర్మాణ పనులు కూడా చేపడుతాం
రఘుపతి పేట సమీపంలోని దుందుభి నదిపై వంతెన నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని ఎంపి రాములు తెలిపారు. రఘుపతి పేట, రామగిరి బ్రిడ్జి పనులను వేగంగా పూర్తి చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నా రు. రఘుపతి పేట వంతెన రామగిరి, తెలకపల్లి, లింగాల, అం బటిపల్లి, కొల్లాపూర్ నేషనల్ హైవేకి కలుస్తుందని, అదే విధంగా కొల్లాపూర్, లింగాల, కల్వకుర్తి, హైదరాబాద్‌కు దూరం తగ్గుతుందని అన్నారు. హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం పట్ల సిఎం కెసిఆర్‌కు నాగర్‌కర్నూల్ ఎంపి రాములుకు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ కృతఙ్ఞతలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News