- Advertisement -
ఢిల్లీ: 2022 జులై నెల జిఎస్‌టి వసూళ్ల గణాంకాల వివరాలను కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. జులై నెలలో దేశ వ్యాప్తంగా రూ.1,48,995 కోట్ల జిఎస్‌టి వసూలు చేశామని, జిఎస్‌టి విధానం అమల్లోకి వచ్చిన తరువాత రెండో అత్యధిక వసూలు అని తెలిపింది. సిజిఎస్‌టి రూ.25,751 కోట్లు, ఎస్‌జిఎస్‌టి రూ.32,807 కోట్లు, ఐజిఎస్‌టి రూ.79.518 కోట్లు, సెస్‌రూపంలో రూ.10,920 కోట్లు వసూలు చేసినట్టు పేర్కొంది. గత ఏడాది జులై నెలతో పోలిస్తే ఈ ఏడాది 28 శాతం వృద్ధి నమోదు చేశామని, జులై నెలలో తెలంగాణ నుంచి రూ.4547 కోట్ల జిఎస్‌టి వసూలు చేశామని వివరించింది. గత ఏడాది ఏప్రిల్ నెలతో పోల్చితే జిఎస్‌టి వసూళ్లలో 26 శాతం వృద్ధి నమోదు చేశామన్నారు.
- Advertisement -