Wednesday, January 22, 2025

గచ్చిబౌలిలో రూ. 5 కోట్ల నగదు పట్టివేత… ఐటి అధికారులకు అప్పగింత !

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్:  అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ధన ప్రవాహానికి అడ్డుకట్ట పట్టడం లేదు. పోలీసులు, అధికారుల తనిఖీల్లో కోట్లాది రూపాయల నగదు కట్టలు బయటపడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 248 చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి మరీ పోలీసులు, అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ పరిధిలో పోలీసులు భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు.

శ్రీరామ్ నగర్ కాలనీలో తనఖీలు చేసి రెండు కార్లలో తరలిస్తున్న రూ.5 కోట్లను మాదాపూర్ ఎస్వోటి, పోలీసులు పట్టుకున్నారు. నగదుకు సంబంధించి ఎటువంటి లెక్కలు చూపకపోవడంతో వాటిని ఐటి శాఖకు అప్పగించారు. ఈ కేసులో మొత్తం ఎనిమిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హవాల డబ్బు ఓ వ్యాపార వేత్తగా పోలీసులు చెబుతుండగా పట్టుబడ్డ ఎనిమిది మంది పెద్దపల్లి జిల్లాకు చెందినవారు కావడం గమనార్హం. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో నిన్నటి వరకు రూ.657.60 కోట్లు మొత్తం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గడిచిన 24 గంటల్లో రూ.18.06 కోట్లు స్వాధీనం చేసుకోగా తాజాగా ఇవాళ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని రూ. 5 కోట్ల నగదును పట్టుకున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News