Monday, December 23, 2024

చిన్నారి ఆపరేషన్‌కు సీఎంఆర్‌ఎఫ్ కింద రూ.5 లక్షల సాయం

- Advertisement -
- Advertisement -

యాదాద్రి:యాదగిరిగుట్ట మండలం చిన్నగౌరాయపల్లికి చెందిన అన్నాబత్తుల లహరి గుండె ఆపరేషన్ కోసం సీఎం రిలీఫ్ ఫండ్ కింద రూ.5 లక్షలను ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి సాయం చేశారు. చేనేత కుటుంబానికి చెందిన అన్నాబత్తుల సత్యనారాయణ 11 ఏళ్ల కూతురు లహరికి గుండె మార్పిడి చేయాలని నిమ్స్ వైదు ్యలు తెలిపారు.

ఈ విషయాన్ని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే స్పందించిన ఆమె నిమ్స్ వైద్యులు డా.అమరేశ్వర్‌రావుతో శనివారం మాట్లాడారు. తక్ష ణ సాయంగా రూ. 5 లక్షలు అవసరమవుతాయని వై ద్యులు తెలపడంతో వెంటనే ఈ విషయాన్ని సీఎం కెసిఆర్‌కు ఎమ్మెల్యే తె లియజేశారు. సీఎంవో నుంచి నిమ్స్ ఆస్పత్రికి రూ.5 లక్షల ఎల్వోసీ కోసం ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు.

బాలిక కుటుంబ సభ్యులు ఆ ందోళన చెందాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే గొ ంగిడి సునీత భరోసా ఇచ్చారు. తమ కూతురి పరిస్థితిపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యేకు లహరి కుటు ంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News