- Advertisement -
హైదరాబాద్: ఇళ్లు నిర్మించుకునే పేదలకు రూ.5 లక్షల ఆర్థిక సాయం చేస్తామని, ఇళ్లు నిర్మించుకునే ఎస్‌సి ఎస్‌టిలకు రూ. 6 లక్షల ఆర్థిక సాయం చేస్తామని గవర్నర్ తమిళి సై సౌంధరరాజన్ తెలిపారు. ఉభయసభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగించారు. మెగా డిఎస్‌సి ద్వారా ఆరు నెలల్లో ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని, ఏడాదిలోగా రెండు లక్షల ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. భూమాత ద్వారా భూ సమస్యలను పరిష్కారం చేస్తామని పేర్కొన్నారు. విద్యుత్ సంస్థలు 81 వేల కోట్ల అప్పుల్లో మునిగిపోయిందన్నారు. గత ప్రభుత్వాల తప్పిదంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందన్నారు. గత ప్రభుత్వ నిర్వాహకంతో విద్యుత్ వ్యవస్థం ఆగమైందని పేర్కొన్నారు. హైదరాబాద్‌ను డ్రగ్ ఫీ సీటీగా మారుస్తామని గవర్నర్ చెప్పారు.
- Advertisement -