- Advertisement -
హైదరాబాద్: రూ.5 లక్షల విలువైన ప్రమాద బీమా సదుపాయాన్ని గిగ్, ప్లాట్‌ఫామ్ వర్కర్లకు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రమాదవశాత్తూ ఎవరైనా మరణిస్తే వారి కుటుంబాలకు ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తుందని కార్మిక శాఖ ప్రత్యే ప్రధాని కార్యదర్శి రాణి కుముదిని ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు గిగా ప్లాట్‌ఫామ్ వర్కర్లతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమావేశమయ్యారు. వారి సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. హోంగార్డులు, జర్నలిస్టులు, ఆటో డ్రైవర్లతో పాటు గిగ్, ప్లాట్‌ఫామ్ వర్కర్లకు ఐదు లక్షల రూపాయల ప్రమాద బీమా కల్పిస్తామన్నారు. కార్మికుల ప్రమాద బీమాకు రవాణా శాఖ కమిషనర్ మాస్టర్ పాలసీ హోల్డర్‌గానూ, సహాయ మోటారు వాహన ఇన్‌స్పెక్టర్లు రిజిస్ట్రీ అథారిటీగాను పని చేస్తారు.
- Advertisement -