Saturday, November 23, 2024

కడుపునిండా తిండి

- Advertisement -
- Advertisement -

ముఖ్యమంత్రి కెసిఆర్ గొప్ప
మానవతావాది రోగుల
సహాయకుల కోసం భోజనం
అందించాలని, నైట్
షెల్టర్లు నిర్మించాలని గతంలోనే
ఆదేశించారు ఇందుకే రూ.5
భోజనం తీసుకువచ్చాం రేషన్
కార్డుదారులకు ఒక్కొక్కరికి
6 కిలోల బియ్యం ఇస్తున్నాం:
మంత్రి హరీశ్‌రావు

RS 5 Meals launched in hospitals

మన తెలంగాణ/హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 18 ప్రభుత్వాసుపత్రుల్లో రోగి సహాయకులకు రూ.5 భోజన వసతి ప్రారంభమైంది. హరే కృష్ణా మూమెంట్ ఛారిటబుల్ ట్రస్ట్ తో కలిసి రాష్ట్ర వైద్యారోగ్యశాఖ రోగులకు సహాయకులకు ఆహార వసతి కల్పిస్తోంది. జిహెచ్‌ఎంసి పరిధిలోని వివిధ ఆసుపత్రుల్లో రోగుల సహాయకులకు రూ.5 భోజనం కార్యక్రమాన్ని మంత్రులు, ఎంఎల్‌ఎలు, నాయకులు ప్రారంభించారు. ఉస్మానియా ఆసుపత్రిలో గురువారం రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు హోం మంత్రి మహమూద్ అలీ, ఎంఎల్‌ఎ రాజాసింగ్‌తో కలిసి రూ.5 భోజన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే కొత్త ఆర్థపెడిక్ బ్లాక్‌ను, ఆధునీకరించిన ఒపి రిజిస్ట్రేషన్, ఫార్మసీ బ్లాక్‌లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టిఎస్‌ఎంఐడిసి ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు, ఉస్మానియా హాస్పిటల్ సూపరిటెండెంట్ డాక్టర్ నాగేందర్, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ, రోగుల సహాయకులకు రోజూ మూడు పూటలా రూ.5కే భోజన వసతి కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ము ఖ్యమంత్రి కెసిఆర్ గొప్ప మానవతావాది అని కొనియాడారు. పేదల ఆకలి తీర్చేందుకు రేషన్‌కార్డు ఉన్న వారికి కుంటుంబంలో ఒక్కొక్కొకి 6 కేజీల చొప్పున ఇంట్లో ఉన్న అందరికి భోజ నం అందించిన ఘనత సిఎం కెసిఆర్‌దేనని పేర్కొన్నారు. రాష్ట్రం వచ్చిన తొలి రోజుల్లోనే పేదలు కడుపు నిండా భోజనం చేయాలనే ఉద్దేశంతో సిఎం కెసిఆర్ కిలో బి య్యాన్ని ఒక్క రూపాయికే అందించారని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో మాత్రం ఎంత మంది ఉన్న ఒక్కొక్కరికి 4 కేజీల చొప్పున.. మొత్తం 20 కేజీలకు మించకుండా ఇచ్చేవారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కుటుంబంలోని ప్రతి ఒక్కరికి 6 కిలోల చొప్పున బియ్యం ఇస్తున్నారన్నారు. ఎస్‌సి, ఎస్‌టి, బిసి హాస్టళ్లలో ఒక్కో విద్యార్థికి 200 గ్రాముల చొప్పున కొలిచి ఆహారం అందించేవారని చెప్పారు. అర్ధాకలితో బాధపడుతున్న పిల్లలను గుర్తించి, సన్న బియ్యంతో కడుపునిండా భోజనం పెట్టాలని కెసిఆర్ ఆదేశించారని పేర్కొన్నారు. రాష్ట్రంలో అన్ని హాస్టళ్లలో విద్యార్థులు తిన్నంత భోజనం పెడుతున్నారని చెప్పారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ఆత్మగౌరవంతో బతకాలని సిఎం కెసిఆర్ వారి ఆసరా పింఛన్‌ను పెంచారని తెలిపారు.

త్వరలో ఆసుపత్రుల్లో నైట్ షెల్టర్ల నిర్మాణం

సిఎం కెసిఆర్ గతంలో ఆస్పత్రులను సందర్శించినప్పుడు రోగుల సహాయకుల బాధలను గుర్తించి, రోగుల సహాయకులకు ప్రభుత్వ ఆస్పత్రుల వద్ద నైట్ షెల్టర్లు నిర్మించాలని ఆదేశించారని తెలిపారు. ఆ పని కొన్ని చోట్ల పూర్తయిందని, త్వరలోనే మరిన్ని ఆసుపత్రుల్లో నైట్ షెల్టర్లు నిర్మించనున్నట్లు మంత్రి వెల్లడించారు. అలాగే రోగుల సహాయకులకు కూడా భోజనం అందించాలని సిఎం సూచించారని, ఈ క్రమంలోనే రోజుకు 20 వేల మందికి రూ. 5కే అన్నం పెట్టే కార్యక్రమం ప్రారంభిస్తున్నామని అన్నారు. హరే రామ హరే కృష్ణ సంస్థతో ఒప్పందం చేసుకుని ఈ కార్యక్రమం ప్రారంభించామన్నారు. హరేరామ హరేకృష్ణ… పేదల కోసం నిస్వార్థంగా పనిచేసే సంస్థ అని, అందుకే రూ.5 భోజనం అందించే బాధ్యతను ఆ సంస్థకు అప్పగించామని తెలిపారు. ప్రతి భోజనంపై హరే రామ హరే కృష్ణ సంస్థకు రూ. 21 చొప్పున ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రోగులకు సహాయకులకు ఉద యం పెరుగన్నం, పులిహోర, వెజిటబుల్ రైస్, మధ్యా హ్నం, రాత్రి సమయాల్లో అన్నంతోపాటు సాంబారు, పచ్చడి, కూర అందించనున్న ట్లు తెలిపారు. 18 ప్రభుత్వ ఆస్పత్రుల్లో కార్యక్రమానికి రూ. 40 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశామని, ఒక వేళ ఖర్చు పెరిగినా కూడా ప్రభుత్వం భోజనం పెట్టేందుకు వెనుకాడదని మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు.

రోగుల డైట్ ఛార్జీలను పెంచామని మంత్రి వెల్లడించారు. రూ.56 డైట్ ఛార్జీని రూ.112 చేశామని తెలిపారు. దీంతో ప్రభుత్వంపై రూ.43 కోట్ల భారం పడనుందని అన్నారు. డైట్ కోసం కొత్త టెండర్లను పిలుస్తున్నామని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో శానిటేషన్ కోసం రూ.338 కోట్లు బడ్జెట్‌లో కేటాయించామని చెప్పారు. అన్ని ఆసుపత్రుల్లో సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌లు తీసుకురానున్నట్లు చెప్పారు.ఆసుపత్రుల్లో ఫైర్ సేఫ్టీ కోసం భారీగా నిధులు కేటాయించామని అన్నారు.
రూ. 2,679 కోట్లతో 3 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకు శంకుస్థాపన చేశామని గుర్తు చేశారు. టిమ్స్‌లో 1000, నిమ్స్‌లో 2 వేల పడకలకు ప్రభుత్వం త్వరలో అనుమతులు జారీ చేయనుందన్నారు. కొత్త ఆస్పత్రుల్లో ముందే అటెండెంట్ షెల్టర్ హోమ్‌ల నిర్మాణం, వైద్యులు, సిబ్బందికి క్వార్టర్స్ సిద్ధంచేయనున్నట్లు తెలిపారు. అల్వాల్ సూపర్ స్పెషాలిటీ ఆసు పత్రిలో ఎంసీహెచ్ ఆసుపత్రి కూడా ఏర్పాటు చేయనున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అవయవ మార్పిడులు కూడా చేస్తున్నామని తెలిపారు.

హెరిటేజ్‌కు ఇబ్బంది లేకుండా కొత్త బ్లాక్ నిర్మాణం

ఉస్మానియా ఆసుపత్రి హెరిటేజ్‌కు ఇబ్బందులు లేకుం డా కొత్త బ్లాక్ నిర్మాణానికి ఏర్పాట్లు చేపట్టామని మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. హెరిటేజ్‌కు ఇబ్బంది కలుగకుండా నిర్మాణాలు చేపట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలు నిపుణులతో కమిటీని నియమించామని, ఆ కమిటీ ప్రాథమిక నివేదిక అందజేసిందని అన్నారు. కమిటీ పూర్తి నివేదిక ఇచ్చిన వెంటనే సిఎం దృష్టికి, కేబినెట్ దృష్టికి తీసుకువెళ్లి కొత్త బ్లాక్ ఏర్పాటు చేస్తామని మంత్రి పేర్కొన్నారు. సిఎం కెసిఆర్ గతంలో ఉస్మానియా ఆసుపత్రిని సందర్శించి కొత్త భవనం నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని, అయితే హెరిటేజ్‌కు ఇబ్బంది కలుగుకుండా కొంతమంది న్యాయస్థానాన్ని ఆశ్రయించడం వల్ల నిర్మించలేకపోయిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. అందుకే నిపుణుల కమిటీ నివేదిక అందిన తర్వాతనే కొత్త బ్లాక్ నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తామని స్పష్టం చేశారు. ఉస్మానియా ఆసుపత్రిలో రూ.30 కోట్ల పనులను ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. ఉస్మానియాకు 75 ఐసీయూ పడకలను మంజూరు చేయగా.. 40 పడకలను అందుబాటులోకి తెచ్చామని మంత్రి వెల్లడించారు. ఉస్మానియా మార్చురీని అత్యాధునికంగా తీర్చిదిద్దేదుకు రూ.6 కోట్లు కేటాయించామన్నారు. ఆర్థోపెడిక్ కాంప్లెక్స్ నిర్మాణానికి నిధులు కేటాయించామని పేర్కొన్నారు. ఎన్‌ఏబీహెచ్ కింద ఉస్మానియాకు మరో 10 కోట్లు కేటాయించామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News