Sunday, January 19, 2025

కాంట్రాక్టర్ సహా పలువురి ఇళ్లలో ఐటీ సోదాలు.. రూ.50 కోట్లు సీజ్

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: కర్ణాటకలో గురువారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఇంకమ్‌టాక్స్ అధికారుల దాడులు జరిగాయి. దాదాపు 45 చోట్ల జరిపిన సోదాల్లో ఓ కాంట్రాక్టర్, అతడి కుమారుడు, జిమ్ యజమాని, ఆర్కిటెక్ట్ సహా పలువురి ఇళ్లల్లో రూ.50 కోట్లకు పైగా నగదు సీజ్ చేసినట్టు ఐటీ శాఖ అధికారులు వెల్లడించారు. రెండు ప్రధాన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలకు సంబంధించి 25 చోట్ల గురువారం ప్రారంభమైన సోదాలు శనివారం సాయంత్రానికి 45 ప్రదేశాలకు చేరినట్టు ఒక అధికారి వెల్లడించారు.

గత బీజేపీ సర్కార్‌పై 40 శాతం కమిషన్ ఆరోపణలు చేసిన ఓ ప్రముఖ కాంట్రాక్టర్ ఇంటిపై దాడులు జరిగినట్టు బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. బిల్డర్లను బ్లాక్‌మెయిల్ చేస్తున్నారంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ విరుచుకుపడుతోంది. ఈ సందర్భంగా మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత.. సీటీ రవి మాట్లాడుతూ లంచాలు ఇవ్వడానికి నిరాకరిస్తున్నందున ఇళ్లనిర్మాణం చేస్తున్న ప్రముఖ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీకి నీటి కనెక్షన్ నిరాకరించిన సందర్భం కూడా ఉందన్నారు. చదరపు అడుగుకు రూ.100 చొప్పున లంచం ఇవ్వాలని అడుగుతున్నారని, గతంలో ఇలాంటివి ఎన్నడూ చూడలేదని ఆయన ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News