Monday, December 23, 2024

సత్తుపల్లి నియోజకవర్గంలో 817 పనులకు రూ.50 కోట్లు నిధులు మంజూరు

- Advertisement -
- Advertisement -

సత్తుపల్లి : సత్తుపల్లి నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో 817 పనులకు రూ. 50 కోట్లు ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తెలిపారు. ఆదివారం సాయంత్రం ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ సత్తుపల్లి నియోజకవర్గానికి ప్రత్యేకంగా అభివృద్ధి పనుల కోసం నిధులు కేటాయిస్తున్నారని ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి, మంత్రి వర్గానికి కృతజ్ఞతలు తెలిపారు.

సత్తుపల్లి మండలానికి 122 పనులకు 9.05 కోట్లు, పెనుబల్లి మండలానికి 203 పనులకు 10 86.50 కోట్లు, వేంసూరు మండలానికి 150 పనులకు 773.50 కోట్లు, కల్లూరు మండలానికి, 218 పనులకు 1277, తల్లాడ మండలానికి 116 పనులకు 588 కోట్లు, సత్తుపల్లి మున్సిపాలిటీ 6 పనులకు 185.00 కోట్లు, దేవదాయ శాఖ 2 పనులకు కోట్ల 85 లక్షలు మంజూరయ్యాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయం అధ్యక్షులు కొత్తూరు ఉమామహేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ కూసం పొడి మహేష్, జడ్పిటిసి సభ్యులు కూసంపూడి రామారావు, ఎంపీపీ దొడ్డ హైమావతి శంకర్, ఆత్మ కమిటీ డివిజన్ అధ్యక్షుడు వనమా వాసు, జిల్లా మైనార్టీ నాయకులు షేక్ రఫీ, పార్టీ మండల అధ్యక్షులు యాగంటి శ్రీనివాస్ రావు, పెనుబల్లి ఎంపీపీ లక్కినేని అలేఖ్య, పెనుబల్లి మండల పార్టీ అధ్యక్షులు కనగాల వెంకట్రావు, కౌన్సిలర్లు మట్ట ప్రసాద్, చాంద్ పాషా, అద్దంకి అనిల్, రఘు, గఫార్ నాగుల్‌మీరా, కంటే పద్మావతి, మల్లూరి అంకమరాజు, నరుకుళ్ళ శ్రీనివాసరావు, ఆనందరావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News