Sunday, December 22, 2024

గజ్వేల్‌లో రూ.50 లక్షల నగదు పట్టివేత

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట జిల్లా, గజ్వేల్ పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో రూ.50 లక్షల నగదును పోలీసులు పట్టుకున్నారు. సిపి అనురాధ తెలిపిన వివరాల ప్రకారం…కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాల ఆదేశానుసారం పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలను నిర్వహించడానికి విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహిస్తాస్తున్నామని అన్నారు. శుక్రవారం రాత్రి గజ్వేల్ పట్టణంలో సిఐ సైదా, అడిషనల్ సిఐ ముత్యం రాజు, సిబ్బంది, కేంద్ర బలగాలు,

సిఐఎస్‌ఎఫ్ సిబ్బందితో వాహనాలు తనిఖీ చేపట్టారని తెలిపారు. రాయపోల్ గ్రామానికి చెందిన కారు యజమాని బచ్చు రత్నాకర్ తన కారులో 50 లక్షల రూపాయలను ఎలాంటి ఆధారాలు లేకుండా తీసుకొని వెళ్తుండగా సీజ్ చేశామని తెలిపారు. ఈ డబ్బులను ఐటి శాఖకు అప్పగిస్తామని తెలిపారు. బాధితుడు ఆ డబ్బులకు సంబంధించిన సరైన ధ్రువపత్రాలు చూపించి తీసుకొని వెళ్లవచ్చునని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News