Saturday, December 21, 2024

జాన్‌పహాడ్ ఉర్సు ఉత్సవాలకు రూ.50లక్షలు మంజూరు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/పాలకవీడు : జాన్‌పహాడ్‌ దర్గా ఉర్సు ఉత్సవాలకు సీఎం కేసీఆర్ రూ.50లక్షలు మంజూరు చేశారని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి తెలిపారు. ఉర్సు ఉత్సవాల సందర్బంగా బుదవారం జాన్‌పహాడ్ దర్గాను దర్శించుకుని ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అధిక ధరలతో భక్తులను ఇబ్బంది పెట్టొద్దని దర్గాలో ధరల పట్టికను ఏర్పాటు చేయాలన్నారు. దర్గా వద్ద దండాలు వసూలు చేసే వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.ఇంతకు ముందు ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే చర్యలు తప్పవని బోర్డు అధికారులకు హెచ్చరించారు. జాన్‌పహాడ్ దర్గా అభివృద్దికి కృషి చేస్తానన్నారు.

సైదన్న దయవల్ల ప్రజలందరూ సుఖఃసంతోషాలతో ఉండాలని ఆ భగవంతుడిని కోరినట్లు తెలిపారు. అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. ఉర్సు ఉత్సవాలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలన్నారు. దర్గా పరిసరాలలో ఎలాంటి అసాంఘీక కార్యక్రమాలకు తావులేకుండా పటిష్ట నిఘా ,బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్‌ఎస్ అద్యక్షుడు ,సర్పంచ్ కిష్టపాటి అంజిరెడ్డి, జిల్లా రైతు సమన్వయ సమితి మెంబర్ మలిమంటి దుర్గారావు,శేషురెడ్డి, పసుపులేటి సైదులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు,పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News