- Advertisement -
మంగళవారం ఒకరోజే రూ. 200కోట్లు
జమ రెండు రోజుల్లో మరో
రూ. 300కోట్లు ఇప్పటి వరకు
24.74లక్షల మందికి లబ్ధి
మన తెలంగాణ / హైదరాబాద్ : రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 3 ఎకరాల నుండి 4 ఎకరాల లోపు రైతులకు రైతు భరోసా నిధులు రూ. 500 కోట్లు విడుదల చేసింది. మంగళవారం ఒక్కరోజే రూ. 200 కోట్లు రైతుల ఖతాల్లో జమచేసింది. మరో రెండు రోజుల్లో నాలుగు ఎకరాల వరకు రైతు భరోసా పూర్తి చేయనుంది. ఆ తర్వాత 4 నుంచి 5 ఎకరాల వరకు రైతుల ఖాతాల్లో జమచేయనున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 54 లక్షల 74 వేల రైతులకు రూ. 4,666.57 కోట్లు రైతు భరో సా నిధులు విడుదల చేసింది.
- Advertisement -