- Advertisement -
హైదరాబాద్: నిమ్రా సెర్ గ్లాస్ టెక్నాలజీస్ సంస్థ ఎండిని సైబర్ నేరగాళ్లు తప్పుదోవ పట్టించి యాభై మూడు లక్షలు రూపాయలు కొట్టేసిన సంఘటన హైదరాబాద్ లోని మసాబ్ ట్యాంక్ లో జరిగింది. మెటీరియల్ కొనుగోలు కోసం ఒక ఇంటర్నేషనల్ సంస్థ తో నిమ్రా సంస్థ యజమాని ఖాదర్ ఒప్పందం చేసుకున్నాడు. మొదటి విడతలో డాలర్ల రూపంలో అడ్వాన్స్ మొత్తం ట్రాన్స్ ఫర్ చేశాడు. రెండో విడత చెల్లింపు సమయంలో ఖాదర్ ని సైబర్ నేరగాళ్లు ట్రాప్ చేశారు. సంస్థ అధికారులమని డబ్బును లండన్ లో ఉన్న వేరే బ్యాంకు ఖాతాకు పంపించాలని సైబర్ నేరగాళ్లు సూచించిడంతో ఖాదర్ నమ్మాడు. అతడి ఈ మెయిల్ ను సైబర్ నేరగాళ్లు స్ఫూప్ చేశారు. వెంటనే ఖాదర్ వారి ఖాతాకు 53 లక్షల 23వేలు ట్రాన్స్ ఫర్ చేశాడు. సంస్థ అసలు అధికారులను సంప్రదించడంతో మోసం బయటపడింది. హైదరాబాద్ సైబర్ క్రైమ్స్ లో బాధితుడు ఖాదర్ ఫిర్యాదు చేశాడు.
- Advertisement -