Sunday, January 12, 2025

రూ. 6.5 కోట్లు స్వాహా చేసిన బ్యాంక్ అధికారులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బెంగంపేట్ యాక్సిస్ బ్యాంక్ ను స్క్రుటినీ చేస్తున్నారు. ఆ బ్యాంకులో అధికారులు ప్రవాస భారతీయుడైన(ఓసిఐ) పరితోశ్ ఉపాధ్యాయ్ ఖాతా నుంచి రూ. 6.5 కోట్లను స్వాహా చేశారని ఆరోపణ. ఆ ఖాతా దారుడు ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ లో నివసిస్తున్నాడు. ఇంత పెద్ద మొత్తం మోసం గత రెండేళ్లలో జరిగిందని సమాచారం.

నిందితులై అధికారుల్లో మాజీ బ్రాంచ్ హెడ్ శ్రీదేవి రఘు, సీనియర్ భాగస్వామి వెంకటరమణ పసర్ల, సర్వీస్ పార్ట్ నర్ సురేఖ సైనీ, సీనియర్ వైస్-ప్రెసిడెంట్ హరి విజయ్, తదితరులు ఉన్నారు. వారి మీద తీవ్ర అభియోగాలున్నాయి. కస్టమర్ ఉపాధ్యాయ ప్రకారం అధికారులు తన సంతకాన్ని ఫోర్జరీ చేసి డబ్బులు విత్ డ్రా చేసుకున్నారు. లూజ్ చెక్లను వాడారు. అనాథరైజ్డ్ ట్రాన్స్ పర్లు చేశారు. రెండేళ్ల క్రితం బ్యాంకు మేనేజ్ మెంట్ కు క్రైమ్ గురించి ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి దిద్దుబాటు చర్యలు తీసుకోలేదు. ఉపాధ్యాయ ఖాతాను నిందితులు ఎక్స్ ప్లాయిట్ చేశారన్నది ఆరోపణ.

ఈ ఉదంతం ప్రవాస భారతీయ ఖాతాదారులలో ఆందోళన కలిగిస్తోంది. ఆస్ట్రేలియాలోనే కాక ఇతర దేశాల్లో ఉన్నవారు కూడా తమ ఖాతాల విషయంలో ఆందోళన చెందుతున్నారని సమాచారం.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News