Friday, November 15, 2024

ఒక్క రోజులోనే రూ.600 కోట్ల ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకం

- Advertisement -
- Advertisement -

Ola Scooters booking bumper hit
న్యూఢిల్లీ: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల ఆన్‌లైన్ అమ్మకం కౌంటర్‌లో బుధవారం అనూహ్యమైన స్పందన లభించింది. ఎస్1, ఎస్ ప్రో వెరైటీ స్కూటర్లు ఒక్క రోజులోనే  600 కోట్లకు పైగా అమ్మినట్లు ఓలా సంస్థ వెల్లడించింది. వీటి అమ్మకాలు గురువారం అర్ధరాత్రితో ముగియనుంది. “అమ్మకపు కౌంటర్ తెరిచినప్పటి నుండి ప్రతి సెకండ్‌కు నాలుగు ఇ-స్కూటర్లు అమ్ముడుపోయాయి. ఇలా ఒక్క రోజులోనే రూ. 600 కోట్ల విలువైన స్కూటర్లను విక్రయించాము” అని ఓలా కంపెనీ సిఇఒ భవీశ్ అగర్వాల్ తెలిపారు.

ఓలా ఎస్1 ఇ-స్కూటర్ ధర రూ. 1 లక్షకాగా, ఎస్1 ప్రో ధర రూ. 1.30 లక్షలుగా ఉంది. అయితే వేర్వేరు రాష్ట్రాల్లో వీటి షో రూమ్ ధరలు వేర్వేరుగా ఉండనున్నాయి. ఓలా ఎస్1 మైలేజి 120 కిమీ. కాగా, ఓలా ఎస్ ప్రో రేంజ్ 180 కిమీ. అయితే ఈ రెండు వెరైటీలలో ఇంకా రంగు, టాప్ స్పీడ్, బ్యాటరీ ప్యాక్ తదితర తేడాలు కూడా ఉన్నాయి.  ఓలాకు షోరూమ్‌లు అంటూ ఏమీ లేవు, కానీ నేరుగా ఇంటికే అమ్మే పద్ధతిని అనుసరిస్తోంది. ఇక టెస్ట్ డ్రైవ్‌లు, డెలివరీలు అక్టోబర్ నుండి మొదలు కానున్నాయి. ఇఎంఐ రుణ సదుపాయంతో ఓటా ఇ-స్కూటర్లు కొనుగోలు చేసుకునేందుకు వీలుగా అనేక ఆర్థిక సంస్థలతో ఓలా కంపెనీ టైఅప్ పెట్టుకుంది. తమిళనాడు ఫ్యాక్టరీ నుంచి వినియోగదారుడి చిరునామాకు ఓలా స్కూటర్లు చేరేవేసే వరకు బుకింగ్ మొత్తం, ఏదేని ఇతర అడ్వాన్సులు కావాలనుకుంటే తిరిగి ఇచ్చేస్తారు(రీఫండ్ చేస్తారు). ఓలా ఎలక్ట్రిక్ ఫ్యాక్టరీని అత్యధిక మహిళా ఉద్యోగినులు పనిచేసే ‘ఫ్యూచర్‌ఫ్యాక్టరీ’గా తీర్చిదిద్దుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News