Saturday, December 28, 2024

సమాజ సేవకు రూ.60,000 కోట్లు

- Advertisement -
- Advertisement -

బిలియనీర్ గౌతమ్ అదానీ దాతృత్వం

Gautam Adani surpasses warren buffett

న్యూఢిల్లీ : ఆసియాలో అత్యంత సంపన్నుడు గౌతమ్ అదానీ సమాజ సేవ కోసం రూ.60 వేల కోట్లు (7.7 బిలియన్ డాలర్లు) విరాళంగా ప్రకటించారు. అదానీ తన 60వ జన్మదినం సందర్భంగా ఈ వితరణ చేశారు. ఆరోగ్య సంరక్షణ, విద్య, నైపుణ్యాభివృద్ధిని పెంపొందించడం కోసం అదానీ ఫౌండేషన్ ఈ విరాళం ప్రకటించింది. గురువారం బ్లూమ్‌బర్గ్ ఇంటర్వూలో అదానీ ఈ విషయాన్ని వెల్లడించారు. కంపెనీ ఫౌండేషన్ చేసిన సహాయం దేశీయ కార్పొరేట్ చరిత్రలోనే అతిపెద్దది, ‘నా తండ్రి శాంతిలాల్ అదానీ జన్మ శతాబ్ది సంవత్సరాన్ని కూడా గౌరవిస్తాం’ అదానీ ఈ సందర్భంగా అన్నారు.

ఆరోగ్య సంరక్షణ, విద్య, నైపుణ్యాభివృద్ధి ఈ మూడు విభాగాలకు నిధులను కేటాయింపు కోసం మూడు నిపుణుల కమిటీలను వచ్చే నెలల్లో ఏర్పాటు చేసి, ఆ తర్వాత నిధులను కేటాయిస్తామని ఆయన తెలిపారు. ఈ కమిటీలో అదానీ కుటుంబం నుంచి సభ్యులు ఉంటారు. ప్రపంచంలో అత్యంత ధనవంతులైన మార్క్ జుకర్‌బర్గ్, వారెన్ బఫెట్ వంటివారు దాతృత్వానికి సంపదలో ఎక్కువ భాగం కేటాయించారు. ఇప్పుడు దిగ్గజ పారిశ్రామికవేత్త, అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ కూడా వారి జాబితాలో చేరారు.

అదానీ శుక్రవారం నాడు 60వ పడిలో ప్రవేశిస్తున్నారు, ఈ సందర్భంగా ఆయన ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో అదానీ నికర విలువ 92 బిలియన్ డాలర్లు ఉంది. ఈ ఏడాదిలో ఆయన సంపద 15 బిలియన్ డాలర్లు పెరిగింది. ప్రపంచంలోనే వేగంగా సంపదను పెంచుకున్న బిలియనీర్లలో అందరికంటే ముందుకున్నారని బ్లూమ్‌బర్గ్ ఇండెక్స్ వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News