Tuesday, December 24, 2024

శ్రీవాణి ట్రస్టుకు రూ.650 కోట్ల నిధులు: టిటిడి ఇఒ

- Advertisement -
- Advertisement -

 

తిరుపతి: రూ. లక్ష లోపు విరాళం ఇచ్చేవారికి శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్లు ఇస్తామని టిటిడి ఇఒ ధర్మారెడ్డి తెలిపారు. తిరుమలలో అన్నమయ్య భవన్‌లో టిటిడి ఇఒ ధర్మారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. శ్రీవాణి ట్రస్ట్ విరాళాల వివరాలను ఇఒ ధర్మారెడ్డి వెల్లడించారు. లక్ష రూపాయలు విరాళం ఇచ్చే భక్తులకు దర్శనం గదుల సౌకర్యం కల్పిస్తామని పేర్కొన్నారు. పది వేల రూపాయలు విరాళం ఇచ్చే భక్తులకు బ్రేక్ దర్శనం ఉంటుందన్నారు. శ్రీవాణి ట్రస్టుకు రూ.650 కోట్ల నిధులు సమకూరాయని, శ్రీవాణి ట్రస్ట్ నిధులతో దక్షిణాన 2068 ఆలయాలు నిర్మిస్తున్నామన్నారు. ఆరు నెలల్లో ఉన్న ఆలయాల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News