Sunday, December 22, 2024

రూ. 7.6 కోట్ల బంగారం స్వాధీనం

- Advertisement -
- Advertisement -

విదేశాల నుంచి అక్రమంగా తరలించిన రూ. 7.60 కోట్లు విలువచేసే 9.4 కిలోల బంగారాన్ని ముంబై విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకుని ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. బంగారం అక్రమ తరలింపుపై సమాచారం అందుకున్న డిపార్ట్‌మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డిఆర్‌ఐ) అధికారులు బుధవారం జైపూర్ నుంచి ముంబైకి వచ్చిన విమానంలో మారు పేర్లతో ప్రయాణించిన ఇద్దరు వ్యక్తులను అడ్డుకున్నారు.

వారి బ్యాగేజీని తనిఖీ చేయగా 9.487 కిలోల బరువున్న విదేశీ బంగారం బిస్కెట్లుగల మూడు ప్యాకెట్లు లభించాయి. వారిని ప్రశ్నించగా కువైట్ నుంచి బంగారం స్మగ్లింగ్ జరిగిందని, ఒక అంతర్జాతీయ విమానం నుంచి తమకు ఈ బంగారం అందిందని వారు చెప్పినట్లు ఒక అధికారి తెలిపారు. డొమెస్టిక్ రూట్‌లో ఈ బంగారాన్ని తరలిస్తున్నారని ఆయన చెప్పారు. నకిలీ పేర్లతో ప్రయాణిస్తున్న ఆ ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఆ అధికారి తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News