Monday, January 20, 2025

ఎర్లీబర్డ్‌కు నగర వాసుల నుంచి విశేష స్పందన

- Advertisement -
- Advertisement -

పౌర సేవా కేంద్రాల ముందు భారీ క్యూలు కాసుల గలగల
ఎర్లీబర్డ్ కింద రూ.700 కోట్లు వసూళ్లు ?
అంచనకు మించి కలెక్షన్

మన తెలంగాణ/సిటీ బ్యూరో: జిహెచ్‌ఎంసి ఎర్లీబర్డ్ పథకకానికీ నగరవాసుల నుంచి విశేష స్పందన లభించింది. దీంతో బల్దియాకు కాసులు వర్షం కురిసింది. 2022-23 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి ఎర్లీబర్డ్ కింద సుమారు రూ.700 కోట్లు వచ్చాయి. ముందస్తుగానే ఆస్తిపన్ను చెల్లించేవారికి ఎర్లీబర్డ్ పథకం కింద జిహెచ్‌ఎంసి 5 శాతం రాయితీ ఇస్తోంది. ఇందులో భాగంగా ఏఫ్రిల్ 1వ తేదీ నుంచి 30 తేదీ వరకు నెల రోజుల పాటు ఎర్లీబర్డ్ పథకాన్ని అమలు చేసింది. శనివారం చివరి రోజుల కావడంతో నగరవాసుల నుంచి విశేష స్పందన లభించింది. ఆన్‌లైన్‌లో మాత్రమే కాకుండా ఆప్‌లైన్‌లో సైతం ఆస్తిపన్ను చెల్లించేందుకు జిహెచ్‌ఎంసి అన్ని సర్కిల్ కార్యాలయాలతో పాటు ప్రధాన కార్యాలయంలోని పౌర సేవా కేంద్రం(సిఎస్‌సి) వద్ద నగరవాసులు భారులు తీరారు.

రికార్డు స్థాయిలో వసూళ్లు:

ఎర్లీబర్డ్ పథకం కింద ఈ ఏడాది రికార్డు స్థాయిలో ఆస్తిపన్ను వసూళ్లుఅయ్యాయి. కేవలం నెల రోజుల్లో దాదాపు రూ.700 కోట్ల మేర ఆస్తుపన్ను వసూళ్లు అయ్యాయి. ఎర్లీబర్డ్ చరిత్రలోనే రికార్డు స్థాయిలో ఆస్తిపన్ను వసూళ్లు కావడంతో అధికారులు హర్షం వ్యక్తం చేశారు. గత ఏడాది మెత్తం 12 నెలల్లో రూ.1400 కోట్ల పై చిలుకు వసూళ్లగా వాటితో పోల్చితే ఈ ఏడాది కేవలం నెల రోజుల్లోనే రూ.700 కోట్లు (50 శాతం) వసూళ్లు అయింది. ఏఫ్రిల్ 26 వ తేదీనాటికి రూ.473 కోట్లు రాగా, కేవలం నాలుగు రోజుల వ్యవధిలో సుమారు రూ.227 కోట్లు వచ్చాయి. ఈ నాలుగు రోజుల్లో ప్రతిరోజు రూ. 40 కోట్ల నుంచి రూ.70 కోట్ల వరకు వసూళ్లు అయ్యాయి.

ప్రతి ఏటా అంతకంతా స్పందన

ఎర్లీబర్డ్ పథకానికి నగర వాసుల నుంచి అంతకంతా స్పందన లభిస్తోంది. 2016 నుంచి జిహెచ్‌ఎంసి ఈ పథకాన్ని అమలు చేస్తుండగా, మొదటి ఏడాది రూ.325 కోట్లు వసూళ్లు కాగా, ఆ తర్వాత నుంచి ప్రతి ఏటా నగరవాసుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. 2019 నాటికి రూ. 535. కోట్లుకు చేరింది. ఈ తర్వాత 2020 లో రూ. రూ.573 కోట్లు రాగా, 2021 సంవత్సరంలో రూ. 580 కోట్లు రాగా, ఈ ఏడాది దాదాపు ఏకంగా రూ.700 కోట్ల మేర వసూళ్లు అయ్యాయి. అయితే ఆదివారం ఉదయానికి పూర్తిస్థాయి లెక్కలు రానున్నట్లు అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News