రూ.3,04,965 కోట్లతో రాష్ట్ర బడ్జెట్
రెవెన్యూ వ్యయం రూ.2,26,982 కోట్లు
మూలధన వ్యయం రూ.36,504 కోట్లు
గత ప్రభుత్వ పాలనలో ఛిద్రమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో
పెడుతున్నాం ఆర్థిక వ్యవస్థను పదేళ్లలో ట్రిలియన్
డాలర్లకు చేర్చడమే లక్ష్యం పూర్తిస్థాయి బడ్జెట్
ప్రవేశపెడుతూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గాంధీ,
అంబేద్కర్, శ్రీశ్రీ సూక్తులతో సాగిన భట్టి ప్రసంగం పల్లెకు
పట్టం.. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ప్రాధాన్యం
పంచాయతీరాజ్‌కు రూ.31,605 కోట్ల కేటాయింపు
షెడ్యూల్డ్ కులాల సంక్షేమానికి రూ. 40,234 కోట్లు
షెడ్యూల్డ్ తెగలకు రూ.17,169కోట్లు వెనుకబడిన తరగతులకు
రూ.11,4-05 కోట్లు వ్యవసాయశాఖకు రూ.24,439
కోట్లు ఫ్యూచర్ సిటీ, హైదరాబాద్ అభివృద్ధిపైనా దృష్టి
మన తెలంగాణ/హైదరాబాద్:కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలకు అధిక ప్రా ధాన్యత ఇచ్చింది. 2025-26 సంవత్సరానికి సంబంధించి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ లో ఈ పథకాలకు అధిక నిధులను కేటాయించారు. ఎస్సీ నిధులు, నీటిపారుదల రంగాల తరువాత అత్యధికంగా ఆరు గ్యారంటీల్లోని 10 అంశాలకు ఈ నిధులను కేటాయించింది. సంక్షేమ రంగాని కి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందుకే ఆరు గ్యారంటీలకు నిధుల స మస్య లేకుండా కేటాయింపులు చేసిన ట్టు ప్రభుత్వం పేర్కొంది. ఈ ఆరు గ్యా రంటీలను అమలు చేసేందుకు ఏకంగా రూ.62,083 కోట్లను ఈ బడ్జెట్‌లో ప్ర భుత్వం కేటాయించింది. రానున్న రోజు ల్లో స్థానిక సంస్థల ఎన్నికలు, ఎంపిటిసి, జెడ్పీటీసి, మున్సిపల్ ఎన్నికలు జరుగనుండడంతో ఈ పథకాలకు అధిక నిధులను ప్రభుత్వం అందించనుంది. అల్పాదాయ కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందించడానికి తీసుకొచ్చిన పథకం గృ హజ్యోతి. 200 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ ఉపయోగించే ఇళ్లకు ఉచిత కరెంట్ అందించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం.ప్రజాపాలన సేవా కేంద్రాల ద్వా రా వచ్చి దరఖాస్తులను తీసుకొని అర్హులకు ఈ ఉచిత విద్యుత్‌ను ప్రభుత్వం అందిస్తుంది. గత సంవత్సరం జూలై 15 వ తేదీ నాటికి 45,81,676 గృహాలకు ఉచిత విద్యుత్‌ను అందించామని, ఈ పథకం కింద జూన్ వరకు సప్లై చేసిన విద్యుత్ డిస్కంలకు ప్రభుత్వం అందించిన మొత్తం రూ.585.05 కోట్లు. ఈ నేపథ్యంలోనే ఈ బడ్జెట్‌లో ఈ స్కీమ్ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.2,148 కోట్లుగా ప్రతిపాదించింది.
ఇప్పటివరకు రూ.200 కోట్లు వెచ్చింపు
నిరుపేద, మధ్యతరగతి కుటుంబాల తరచుగా పెరిగే గ్యాస్ సిలిండర్ ధరలు మోయలేని భారంగా మారాయి. వారి ఆదాయంతో పోలిస్తే పెరిగిన సిలిండర్ ధర వారికి ఒక ఆర్థిక సమస్యగా భావించి రూ.500లకే గ్యాస్ సిలిండర్ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. మహాలక్ష్మి పథకం కింద రూ.500లకే వంటగ్యాస్ సిలిండర్‌ను అందిస్తున్నారు. ఇప్పటివరకు ఈ పథకం ద్వారా 39,57,637 కుటుంబాలకు లబ్ధి చేకూరింది. ఈ పథకానికి ప్రభుత్వం ఇప్పటివరకు రూ.200 కోట్లు వెచ్చించగా తాజాగా బడ్జెట్‌లో రూ.723 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. నిరుపేదలకు గూడును సమకూర్చడం ప్రభుత్వం కర్తవ్యంగా భావించి ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం నూతన గృహ నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇళ్లు కట్టుకోడానికి పేదలకు రూ.5లక్షల ఆర్థిక సాయం అందిస్తోంది. ఈ బడ్జెట్‌లో ఇందిరమ్మ ఇళ్లకు – రూ.12,571 కోట్లను ప్రభుత్వం కేటాయించింది.