Monday, December 23, 2024

నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం నాడు రూ. 75 నాణెం ఆవిష్కరణ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం సందర్భంగా రూ. 75 నాణెమును ఆవిష్కరించనున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించింది. భారత స్వాతంత్య్రం 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కొత్త రూ. 75 నాణెమును ఆవిష్కరిస్తున్నారు. ఈ నాణెము మీద అశోక స్థూపం, ‘సత్యమేవ జయతే’ అని రాసి ఉంటుంది. నాణెము ఎడమ వైపు దేవనాగరి లిపిలో ‘భారత్’ అని ఉంటుంది. అలాగే కుడివైపు ఇంగ్లీషులో ‘ఇండియా’ అని రాసి ఉంటుంది.
ఈ నాణెముపై రూపాయి చిహ్నంతో పాటు 75 అంకె ఉంటుంది. దాని కింద లయన్ క్యాపిటల్ ఉంటుంది. నాణెము మరో వైపు పార్లమెంటు భవనం ఉంటుంది. దానికి దేవనాగరి లిపిలో ‘సంసద్ సంకుల్’ అని రాసి ఉంటుంది. పై భాగంలో ‘పార్లమెంటు కాంప్లెక్స్’ అని ఇంగ్లీషులో రాసి ఉంటుంది. నాణెం వృత్తాకారంలో ఉంటుంది. దాని వ్యాసార్థం 44 మిల్లీమీటర్లు ఉంటుంది. 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం నికెల్, 5 శాతం జింక్‌తో ఈ నాణెం తయారు చేశారు.
ప్రధాని నరేంద్ర మోడీ మే 28న పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించనున్నారు. దీనికి 25 రాజకీయ పార్టీలు హాజరు కానున్నాయి. కాగా కాంగ్రెస్ సహా 19 పార్టీలు బహిష్కరించనున్నాయి.

నూతన పార్లమెంటు భవనాన్ని ప్రధాని మోడీకి బదులు దేశాధినేత, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభోత్సవం చేయాలని అనేక పార్టీలు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నాయి. వాటిలో కాంగ్రెస్, డిఎంకె, జనతాదళ్(యునైటెడ్), ఆమ్ ఆద్మీ పార్టీ, ఎన్‌సిపి, శివసేన(ఉద్ధవ్ థాక్రే), సిపిఐ(మార్కిస్ట్), సమాజ్‌వాది పార్టీ, ఆర్‌జెడి, సిపిఐ, ఐయుఎంఎల్, జెఎంఎం, నేషనల్ కాన్ఫరెన్స్, కేరళ కాంగ్రెస్(మణి), ఆర్‌ఎస్‌పి, ఎండిఎంకె, విడుదలై చిరుతైగల్ కచ్చి, రాష్ట్రీయ లోక్ దళ్, అసదుద్దీన్ ఓవైసీకి చెందిన ఆల్ ఇండియా మజ్లీస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్(ఎఐఎంఐఎం) ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News