Sunday, January 5, 2025

‘గేమ్‌ ఛేంజర్‌’ సాంగ్స్ కోసం అన్ని రూ. కోట్లా..!

- Advertisement -
- Advertisement -

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ తెరకెక్కిన చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’. బాలీవుడ్ బామ కియారా అడ్వాణీ రెండోసారి రామ్ చరణ్ కు జోడీగా నటిస్తోంది. జనవరి 10న సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ క్రమంలో మేకర్స్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. తాజాగా ఈ మూవీలోని సాంగ్స్ పై సినీ విశ్లేషకుడు తరుణ్ ఆదర్శ్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ సినిమాలోని పాటల కోసం నిర్మాతల ఏకంగా రూ.75 కోట్లు ఖర్చు పెట్టారని పోస్ట్ చేశారు. తమన్‌ సంగీతం అందించిన ఇందులోని నాలుగు పాటలు ఇప్పటి విడుదలై సూపర్ హిట్ గా నిలిచాయి. కాగా, ఈ రోజు సాయంత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’ ట్రైలర్ మేకర్స్ విడుదల చేయబోతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News