రూ.792 కోట్ల రికవరీ
న్యూఢిల్లీ: పరారీలో ఉన్న ప్రముఖ వ్యాపారవేత్తలు విజయ్‌మమాల్యా, నీరవ్‌మోడీ, మెహుల్‌చోక్సీలకు చెందిన రూ.9,371 కోట్ల విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి)ఎస్‌బిఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియంకు బదిలీ చేసిన విషయం తెలిసిందే. వీటిలో కొన్ని షేర్లను తాజాగా విక్రయించిన కన్సార్టియం రూ.792.11 కోట్లను రాబట్టుకొంది. ఈ ముగ్గురు వ్యాపారవేత్తల వల్ల బ్యాంకులకు మొత్తం రూ.28,585.83 కోట్ల నష్ట వాటిల్లినట్లు ఇడి గతంలోనే స్పష్టం చేసింది. దీంట్లో 84. 45 శాతం అంటే18,170.02 క్లో విలువైన ఆస్తులను ఇడి గతంలోనే అటాచ్ చేసింది. వీటిలో రూ.9,371 విలువైన ఆస్తులను బ్యాంకుల కన్సార్టియానికి బదిలీ చేసింది. వీటిలో ఆ ముగ్గురికి చెందిన కొన్ని షేర్లు కూడా ఉన్నాయి. గతంలోనే వాటిలోనుంచి రూ.7181 కోట్ల విలువైన షేర్లను కన్సార్టియం తరఫున డెట్ రికవరీ ట్రిబ్యునల్ (డిఆర్‌టి) విక్రయించింది. తాజాగా మరో రూ.792.11 కోట్ల విలువైన షేర్లను సైతం అమ్మి మరికొంత సొమ్మును రాబట్టింది.