Friday, November 15, 2024

మోడీ ప్రభుత్వం 8 ఏళ్లలో రూ. 80 లక్షల కోట్లు అప్పు తెచ్చింది

- Advertisement -
- Advertisement -

KTR

హైదరాబాద్: బిజెపి ప్రభుత్వం దేశాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేస్తోందని టిఆర్‌ఎస్ శనివారం ఆరోపించింది. కేంద్రం తెచ్చిన అప్పుల వల్ల దేశం అప్పుల ఊబిలో కూరుకుపోతోందని విమర్శించింది. బిజెపికి వ్యతిరేకంగా రాజకీయ ఛార్జిషీటును టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటి రామారావు విడుదల చేశారు. రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల వల్ల ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారన్నారు. “స్వాతంత్రం వచ్చిన 67 ఏళ్ల కాలంలో వివిధ ప్రధానులు దేశాన్ని పలించారు. వారు అప్పటి వరకు రూ. 55.87 కోట్లే అప్పు చేశారు. కానీ 2014లో బిజెపి అధికారంలోకి వచ్చాక(ప్రధాని నరేంద్ర మోడీ) ఈ ఎనిమిది ఏళ్లలో రూ. 80 లక్షల కోట్లు అప్పుచేశారు” అని రామారావు పేర్కొన్నారు. 2014-15లో కేంద్ర వడ్డీగా చెల్లించింది రెవెన్యూలో 36.1 శాతమే, కానీ 2021 నాటికి అది 43.1 శాతానికి ఎగబాకింది.

“మిషన్ భగీరథకు రూ. 19000కోట్లను నీతి ఆయోగ్ సిఫారసు చేసినప్పటికీ మోడీ ప్రభుత్వం 19 పైసలు కూడా ఇవ్వలేదు, రాష్ట్రాంలోని ప్రతి గ్రామానికి మంచి నీరు అందించే ప్రాజెక్టును ప్రోత్సహించలేదు” అని రామారావు ఛార్జిషీటులో పేర్కొన్నారు. చౌటుప్పల్‌లో పెడదామనుకున్న ఫ్లోరైడ్, ఫ్లోరోసిస్‌ను తగ్గించే కేంద్రాన్ని వేరే రాష్ట్రానికి తరలించారని ఆరోపించారు. ఇక ఎన్‌డిఎ ప్రభుత్వం చేనేత ఉత్పత్తులపై జిఎస్‌టి వేసి చేనేత రంగాన్ని సంక్షోభంలోకి నెట్టేశారు. విధించిన జిఎస్‌టిని 12 శాతానికి పెంచాలని కూడా యోచిస్తున్నదన్నారు. అదనపు రుణాల విషయంలో కేంద్ర ‘బ్లాక్ మెయిలింగ్’కు పాల్పడుతోందని, వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు పెట్టాలని మెలికపెడుతోందని ఛార్జిషీటులో పేర్కొన్నారు. షెడ్యూల్డ్ క్యాస్ట్ రిజర్వేషన్ బిల్లును ఆమోదించకుండా తెలంగాణలోని ఎస్టీలకు అన్యాయం చేస్తోందని కూడా పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News