Thursday, December 19, 2024

బిసిలకు రూ.82 వేల కోట్లు ఖర్చు చేశాం: మోపిదేవి

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: టిడిపి గోబెల్స్ ప్రచారం చేస్తోందని ఎంపి మోపిదేవి వెంకట రమణ విమర్శించారు. గురువారం మోపిదేవి మీడియాతో మాట్లాడారు. యువగళం పేరుతో టిడిపి నేత లోకేష్ పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొస్తున్నారని, అమర్నాథ్ హత్యలో రాజకీయ కారణాల్లేవని, నలుగురు నిందితులను వెంటనే అరెస్ట్ చేశామన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం, ఇంటి స్థలం ఇచ్చామని, అమర్‌నాథ్ కుటుంబాన్ని ప్రభుత్వం సంపూర్ణంగా ఆదుకుందని, అమర్‌నాథ్ తల్లి, చెల్లితో లోకేష్ అబద్ధాలు చెప్పించారని మోపిదేవి మండిపడ్డారు. నాలుగేళ్లలో బిసిల కోసం వైసిపి ప్రభుత్వం రూ.82 వేల కోట్లు ఖర్చే చేసిందన్నారు. బిసిలను అధికంగా రాజ్యసభకు పంపిన ఘనత సిఎం జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. బిసిల కోసం చరిత్రలోనే ఎవరూ చేయనంతగా రాజకీయంగా, సామాజికంగా సిఎం జగన్ చేయూతనిచ్చారని ప్రశంసించారు.

Also Read: ఫాతిమాగా మారిన అంజూ.. మతం మార్చుకొని ప్రియుడితో పెళ్లి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News